– టీ20 సిరీస్ కైవసం
మాంచెస్టర్ : ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత మహిళలజట్టు అదరగొట్టింది. ఇంగ్లండ్ గడ్డపై సిరీస్ కైవసం చేసుకొని హర్మన్‌ప్రీత్ సేన రికార్డు నెలకొల్పింది. ఐదు టి20ల సిరీస్‌లో భాగంగా బుధవారం రాత్రి ఇంగ్లండ్‌తో జరిగిన నాల్గో టి20లో భారతజట్టు ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1 తేడాతో టి20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేయగా.. అనంతరం భారతజట్టు 17ఓవర్లలో కేవలం 4వికెట్లు కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. తొలుత అమన్‌జ్యోత్ కౌర్‌కి తోడు తెలుగమ్మాయి శ్రీచరణి కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. మరోవైపు దీప్తి శర్మ, అరుంధతిరెడ్డి, రాధా యాదవ్ కూడా చెలరేగి బౌలింగ్ చేయడంతో ఇంగ్లండ్ జట్టు స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. సోఫియా డంక్లీ(22), బెల్మాంట్(20), ఆలిస్ కాప్సే(18) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. భారత బౌలర్లలో రాధా యాదవ్, శ్రీచరణికి రెండేసి, అమన్‌జోత్ కౌర్, దీప్తి శర్మ ఒక్కో వికెట్ తీశారు. ఛేదనలో భాగంగా స్మృతి మంధాన(32), షఫాలీ వర్మ(31) కలిసి తొలి వికెట్‌కు 56పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత హర్మన్‌ప్రీత్, రోడ్రిగ్స్ కలిసి గెలుపు తీరాలకు చేర్చారు రోడ్రిగ్స్(24నాటౌట్), హర్మన్‌ప్రీత్ కౌర్(26) బ్యాటింగ్‌లో రాణించారు. అమంజోత్ కౌర్ రనౌట్ కాగా.. రీచా ఘోష్ మరో వికెట్ పడకుండా మ్యాచ్‌ను ముగించింది. ఇంగ్లండ్ బౌలర్లలో షార్లెట్ డీన్, సోఫీ ఎక్లెస్టోన్, ఇస్సీ వాంగ్ తలో వికెట్ తీశారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రాధా యాదవ్‌కు లభించగా.. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా 12న ఐదో, చివరి టి20 మ్యాచ్ జరగనుంది.
స్కోర్‌బోర్డు :
ఇంగ్లండ్ మహిళల ఇన్నింగ్స్: డంక్లే (సి)రాధా యాదవ్ (బి)దీప్తి 22, వాట్-హోడ్జ్ (సి)అరుంధతి (బి)శ్రీచరణి 5, కాప్సే (ఎల్‌బి)శ్రీచరణి 18, బ్యూమౌంట్ (సి)అరుంధతి (బి)రాధా యాదవ్ 20, అమీ జోన్స్ (బి)అమన్‌జ్యోత్ కౌర్ 9, సోల్‌ఫీల్డ్ (సి)అరుంధతి (బి)రాధా యాదవ్ 16, ఛార్లీ డీన్ (రనౌట్) శ్రీచరణి/రీచా 4, ఎక్లేస్టోన్ (నాటౌట్) 16, వాంగ్ (నాటౌట్) 11, అదనం 5. (20ఓవర్లలో 7వికెట్ల నష్టానికి) 126పరుగులు.
వికెట్ల పతనం: 1/21, 2/33, 3/68, 4/70, 5/93, 6/98, 7/101
బౌలింగ్: అమన్‌జ్యోత్ కౌర్ 4-0-20-1, దీప్తి శర్మ 4-0-29-1, శ్రీచరణి 4-0-30-2, అరుంధతి రెడ్డి 3-0-16-0, రాధా యాదవ్ 4-0-15-2, స్నేV్‌ా రాణా 1-0-12-0.
ఇండియా మహిళల ఇన్నింగ్స్: స్మృతి మంధాన (సి)ఫిలెర్ (బ)ఎక్లేస్టోన్ 32, షెఫాలీ వర్మ (సి)కాప్సే (బి)ఛార్లీ డీన్ 31, రోడ్రిగ్స్ (నాటౌట్) 24, హర్మన్‌ప్రీత్ కౌర్ (సి)ఎక్లేస్టోన్ (బి)వాంగ్ 26, అమన్‌జ్యోత్ కౌర్ (రనౌట్) ఛార్లీ డీన్/అమీ జోన్స్ 2, రీచా ఘోష్ (నాటౌట్) 7, అదనం 5. (17ఓవర్లలో 4వికెట్ల నష్టానికి) 127పరుగులు.
వికెట్ల పతనం: 1/56, 2/69, 3/117, 4/119
బౌలింగ్: లారెన్ బెల్ 3-0-32-0, ఫిలెర్ 2-0-18-0, ఛార్లోట్ డీన్ 4-0-29-1, ఎక్లేస్టోన్ 4-0-20-1, వాంగ్ 3-0-18-1, కాప్సే 1-0-10-0.
మహిళల జట్టుఘన విజయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES