– మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలి :కేజీకేఎస్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కల్తీ కల్లు బాధ్యులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కల్లుగీత కార్మిక సంఘం(కేజీకేఎస్) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎంవీ రమణ, బెల్లకొండ వెంకటేశ్వర్లు ఒక ప్రకటన విడుదల చేశారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారాన్ని చెల్లించాలని కోరారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని కూకట్ పల్లిలో (హైదర్ గూడ, షంషీగూడ ఇందిరానగర్, కల్లు డిపోలు) కల్లు తాగి ఆరుగురు చనిపోయారని తెలిపారు. మరి కొంతమంది అస్వస్థకు గురయ్యారని పేర్కొన్నారు. కల్లులో కల్తీ చేయటం వల్ల ఈ దుర్ఘటన జరిగినట్టు తెలిసిందనీ, ఇదే నిజమైతే కల్తీకి పాల్పడిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొంతమంది వ్యాపారులు కల్తీ కల్లుకు పాల్పడటం వల్ల వాస్తవ గీత కార్మికులకు నష్టం వాటిల్లుతున్నదని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు కల్తీ కల్లు వ్యాపారులపై నిఘా ఉంచాలని డిమాండ్ చేశారు.
కల్తీ కల్లు బాధ్యులపై చర్య తీసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES