నవతెలంగాణ-రామగిరి: రామగిరి మండలంలోని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (IJU) అనుబంధ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(TUWJ) యూనియన్ పెద్దపల్లి జిల్లా ఎన్నికైన జిల్లా జర్నలిస్ట్ ప్రతినిధులకు.. గురువారం రామగిరి మండల జర్నలిస్టులు ఘన సన్మానం చేశారు. జిల్లా యూనియన్ ఉపాధ్యక్షునిగా పొన్నం శ్రీనివాస్ గౌడ్, జిల్లా సహాయ కార్యదర్శిగా జ్యోతుల (జెఆర్) ప్రవీణ్, జిల్లా కార్యవర్గసభ్యులుగా చింతం కిరణ్ కుమార్, మల్యాల రమేష్ లు ఇటీవల పెద్దపల్లిలో జరిగిన యూనియన్ ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారిని శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. సన్మానించిన వారిలో స్థానిక జర్నలిస్టులు పివీరావు, నల్లూరి లింగయ్య, చిందం రమేష్, కాపర్తి వెంకటేష్, చిలుక సురేష్, పోలు మధుకర్, సూత్రం శ్రీధర్, జికె రాజు, సిద్ధం ప్రదీప్, దాసరి భరత్, కాపర్తి అభిలాష్, గాజు రఘుపతి, ఇండ్ల అవినాష్, మల్యాల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా జర్నలిస్టలకు ఘన సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES