Friday, July 11, 2025
E-PAPER
Homeతాజా వార్తలుశ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి..మూడు గేట్లు..

శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి..మూడు గేట్లు..

- Advertisement -

న‌వ‌తెలంగాణ-హైద‌రాబాద్: శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది.. ఇన్ ఫ్లో రూపంలో 1,48,696 క్యూసెక్కుల నీరు వచ్చి డ్యామ్‌లో చేరుతుండగా.. మూడు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం.. 882.80 అడుగులుగా ఉంది.. శ్రీశైలం డ్యామ్‌ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు అయితే.. ప్రస్తుతం 203.4290 టీఎంసీలుగా ఉంది.. ఇక, కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.. ఇలా.. ఔట్ ఫ్లో రూపంలో శ్రీశైలం నుంచి 1,48,734 క్యూసెక్కుల నీరు.. నాగార్జున సాగర్‌లోకి వెళ్తోంది.. ఇక, ఈ రోజు శుక్రవారం కావడంతో.. శని, ఆదివారాల్లో పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.. ఇదే సమయంలో.. పర్యటకుల తాకిడితో.. భారీ ఎత్తు ట్రాఫిక్‌ జామ్‌ అయిన సందర్భాలు ఎన్నో ఉన్న విషయం విదితమే..

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -