- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ప్రయివేటు ఇంజినీరింగ్ కళాశాలకు హైకోర్టులో చుక్కెదురైంది. ఫీజులు పెంచుకునేందుకు అనుమతివ్వాలని ఆయా కాలేజీలు దాఖలు చేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఫీజుల పెంపు కోసం ఇచ్చిన వినతులపై టీఏఎఫ్‌ఆర్‌సీ (తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ) నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఆరువారాల్లో నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సూచించింది. ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయంపైనే ఫీజుల పెంపు ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది.
- Advertisement -