నవతెలంగాణ-పెద్దవూర : సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మండల వైద్యాధికారి నగేష్ సూచించారు. ఈ మేరకు శుక్రవారం మండలం లోని నాయినవానికుంట గ్రామం లో ఏఎన్ఎం, ఆశావర్కర్లు,సిబ్బంది తో వైద్య శిభిరం నిర్వహించి సీజనల్ వ్యాధుల నివారణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో డెంగ్యూ, మలేరియా, నీళ్ల విరేచనాలు, జ్వరాలు రాకుండ జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. అంటు వ్యాధుల నివారణపై ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు. దోమ కాటు వ్యాధులైన డెంగ్యూ, మలేరియా , చికున్ గున్యా రాకుండా ప్రతి శుక్రవారం పొడి దినం(డ్రై డే) పాటించాలని, దోమలు ఇంట్లోకి ప్రవేశించకుండా కిటికీలకు తలుపులకు ఇనుప జాలీలను బిగించుకోవాలని కోరారు. ఇంటి ఆవరణలో, పరిసరాలలో నీరు నిలవకుండా చేసుకోవాలని, పాత టైర్లు, పనికిరాని ప్లాస్టిక్, గాజు సీసాలు, డిస్పోజబుల్ కప్పులు, కొబ్బరి చిప్పలు తమ ఇంటి ఆవరణలో లేకుండా చేసుకునే విధంగా ప్రజలకు అవగాహన కలిగించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని అనుమానం ఉన్న వారి రక్త నమూనాలను టి-డయాగ్నొస్టిక్ హబ్‌కు పంపాలని తెలియజేశారు. కలుషితమైన నీరు ఆహారం ద్వారా వ్యాపించే టైఫాయిడ్, డయేరియా తదితర వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నాని అన్నారు.ముఖ్యంగా పరిశుభ్రమైన త్రాగునీరు, చేతుల పరిశుభ్రత , పరిసరాల పారిశుధ్యం గురించి ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ హెచ్ ఓ త్రివేణి,ఏఎన్ఎం సావిత్రమ్మ,ఆశా వర్కర్లు శివలీల,లింగమ్మ వున్నారు.
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి : డాక్టర్ నగేష్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES