Friday, July 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చిన్న ఏడ్గి జీపి మల్టీ పర్పస్ పర్కర్స్  జీతభత్యాల చెక్కులు అందించిన ఎంపీడీవో

చిన్న ఏడ్గి జీపి మల్టీ పర్పస్ పర్కర్స్  జీతభత్యాల చెక్కులు అందించిన ఎంపీడీవో

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని చిన్న ఏడ్గి గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్స్ కార్మికులకు జీతభత్యాలకు సంబంధించిన చెక్కును యుక్కలు ఎంపీడీవో శ్రీనివాస్ శుక్రవారం నాడు అందించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. గ్రామంలోని వీధులలో తిరుగుతూ పరిశుభ్రత గురించి ప్రజలకు అవగాహన పరిచారు. మురికి నీరు రోడ్లపై నిర్వహించకుండా నీటిని మళ్లించి డ్రీమ్స్ లోకి వదిలే విధంగా చర్యలు చేపట్టాలని సంబంధిత జిపి కార్యదర్శి కిఎంపీడీవో ఆదేశించారు . గ్రామాల పరిశుబ్రత పై మొదట  దృష్టి సారించి చెత్తాచెదారం లేకుండా చూడాలని, మురికి కాలువల శుభ్రత నిత్యం చేపట్టాలని సూచించారు . త్రాగునీరు కుళాయిల వద్ద ముఖ్యంగా శుభ్రత పాటించాలని దోమలను నివాసం ఉడే విధంగా నీటి నిల్వలను తొలగించి  మట్టితో గుంతలను కప్పివేయాలని  కార్యదర్శికి తెలిపారు. సీజనల్ వ్యాధులు ఇవ్వకుండా దోమల నివారణ చర్యలలొ భాగంగా గ్రామంలో  ఫాగింగ్  చేయాలని కార్యదర్శికి సూచించారు. అదేవిధంగా గ్రామంలో ఇందిరమ్మ పథకంలో కొత్త నిర్మాణాలు చేస్తున్న లబ్ధిదారుల ఇంటికి ముగ్గు వేసి ప్రారంభించారు. ఇందిరమ్మ పథకంలో మంజూరైన ఇంటి  లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలు ఫరితగతిగా చేపడితే వెనువెంటనే బిల్లులు తమ ఖాతాలో జమ చేయడం జరుగుతుందని లబ్ధిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తో పాటు గ్రామపంచాయతీ కార్యదర్శి కౌలాస్కర్ రాములు , గృహ నిర్మాణ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు .

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -