– టైటిల్ పోరుకు స్పెయిన్ స్టార్
– సెమీస్‌లో టేలర్ ఫ్రిట్జ్‌పై గెలుపు
– వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ 2025
నవతెలంగాణ-లండన్
స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాస్ వింబుల్డన్‌లో ముచ్చటగా మూడోసారి ఫైనల్‌కు చేరుకున్నాడు. వింబుల్డన్‌లో వరుసగా 20వ మ్యాచ్‌లో గెలుపొందిన డిఫెండింగ్ చాంపియన్.. హ్యాట్రిక్ టైటిల్‌కు రంగం సిద్ధం చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై కార్లోస్ అల్కరాస్ 6-4, 5-7, 6-3, 7-6(8-6)తో విజయం సాధించాడు. సుమారు మూడు గంటల పాటు సాగిన సెమీస్ సమరంలో నాల్గో సీడ్ అమెరికన్.. యంగ్ స్పెయిన్ బుల్‌ను నిలువరించటంలో తేలిపోయాడు. 2023, 2024లో వింబుల్డన్ చాంపియన్‌గా నిలిచిన కార్లోస్ అల్కరాస్.. ముచ్చటగా మూడోసారి ఫైనల్‌కు చేరుకుని హ్యాట్రిక్ టైటిల్‌పై కన్నేశాడు. వరల్డ్ నం.1 జానిక్ సినర్ (ఇటలీ), టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ (సెర్బియా) తలపడుతున్న సెమీఫైనల్ విజేతతో కార్లోస్ అల్కరాస్ ఫైనల్లో పోటీపడనున్నాడు.
ఫ్రెంచ్ ఓపెన్‌లో అసమాన విజయంతో వింబుల్డన్‌కు వచ్చిన కార్లోస్ అల్కరాస్ పచ్చికపై ప్రతాపం చూపిస్తున్నాడు. వింబుల్డన్‌లో వరుసగా 20వ మ్యాచ్‌లో గెలుపొందిన అల్కరాస్.. ఐదో సీడ్, అమెరికా ఆటగాడు టేలర్ ఫ్రిట్జ్‌ను చిత్తు చేశాడు. టేలర్ ఫ్రిట్జ్ నాలుగు సెట్లలోనే చేతులెత్తేసినా.. అల్కరాస్‌కు మంచి పోటీ ఇచ్చాడు. 19 ఏస్‌లు కొట్టిన టేలర్ ఫ్రిట్జ్ 44 విన్నర్లు సాధించాడు. అల్కరాస్ 13 ఏస్‌లు, 58 విన్నర్లతో మెరిశాడు. నాలుగు సెట్లలో అల్కరాస్ సర్వ్‌ను టేలర్ ఒక్కసారే బ్రేక్ చేయగా.. స్పెయిన్ బుల్ ఆ పనిమూడు సార్లు చేశాడు. నాల్గో సెట్ టైబ్రేకర్‌కు దారితీయగా.. 8-6తో పైచేయి సాధించిన అల్కరాస్ ఐదో సెట్ అవసరం లేకుండానే ఫైనల్‌కు చేరుకున్నాడు. పాయింట్ల పరంగా 122-112తో అల్కరాస్ ఆధిపత్యం చూపించాడు.
టైటిల్ ఎవరిదో
మహిళల సింగిల్స్ ఫైనల్లో ఇగా స్వైటెక్ (పొలాండ్), ఆమంద అనిసిమోవ (అమెరికా) తలపడనున్నారు. ఐదుసార్లు గ్రాండ్‌స్లామ్ విజేత స్వైటెక్‌కు ఇదే వింబుల్డన్‌లో ఇదే తొలి టైటిల్ పోరు. 13వ సీడ్ ఆమంద అనిసిమోవ 2019 ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీస్‌కు చేరటమే ఆమె కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన. ఎన్నో సవాళ్లు అధిగమించి వింబుల్డన్ ఫైనల్‌కు చేరుకున్న ఆమంద అనిసిమోవ నేడు టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.
ఎదురులేని అల్కరాస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES