Saturday, July 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయందేశ ప్రజలనుకలిపే భాష హిందీ

దేశ ప్రజలనుకలిపే భాష హిందీ

- Advertisement -

– రాజకీయాల కోసమే వారి వ్యతిరేకత : కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

దేశ ప్రజలను కలిపే భాష హిందీ అని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో రాజ్య భాషా విభాగం స్వర్ణ జయంతి సమరోV్‌ా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ తాను తెలుగుకు వ్యతిరేకం కాదని అన్నారు. కొందరు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందీని వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు.
దక్షిణ భారత ప్రజలు మాతృభాషతో పాటు హిందీలో మాట్లాడాలని సూచించారు. అన్ని భారతీయ భాషలు ఎంతో సుందరమైనవని కొనియాడారు. ప్రతి పుష్పాన్ని వివిధ భాషలుగా పోల్చుకుంటే ఒక పూల దండగా తయారు చేసే దారం లాంటిది హిందీ భాష అని అభివర్ణించారు. ఈ వేడుకల్లో రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్‌ హరివంశ్‌, ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌, అధికార భాషా విభాగం కార్యదర్శి అన్షులి ఆర్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -