Saturday, July 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమంత్రాల నెపంతో అన్నను చంపిన తమ్ముడు

మంత్రాల నెపంతో అన్నను చంపిన తమ్ముడు

- Advertisement -

నవతెలంగాణ-కొల్చారం
మానవ సంబంధాలు మంట కలిసి పోతున్నాయనడానికి ఈ హత్యోదంతమే నిదర్శనం. మంత్రాల నెపం, ఆర్థిక విషయాలతో తమ్ముడు.. అన్నను హత్య చేసిన సంఘటన శుక్రవారం మధ్యాహ్నం మెదక్‌ జిల్లా కొల్చారం మండలం అన్సాన్‌పల్లి కల్లు డిపో వద్ద జరిగింది. సంఘటన జరిగిన సమయంలో ప్రత్యక్ష సాక్షులు తీసిన వీడియో కొల్చారం మండలంలోని పలు వాట్సాప్‌ గ్రూపుల్లో వైరల్‌గా మారింది. అంసాన్‌పల్లి వసురం తండాకు చెందిన రామావత్‌ మంఖ్య (45)కు అతని సోదరుడు మోహన్‌కు మధ్య గ్రామంలోని కల్లు డిపో వద్ద మంత్రాల నెపం, ట్రాక్టర్‌ అద్దె డబ్బుల విషయంలో గొడవ జరిగింది. దాంతో మోహన్‌ కల్లు సీసాతో అన్నను మెడపై పొడిచి చంపాడు. చనిపోయిన తర్వాత కూడా మంఖ్య తలకు చేతి రుమాలుతో ఉరివేసి కిరాతకంగా కొట్టిన వీడియో మండలంలో వైరల్‌గా మారింది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతునికి భార్య సంతు, ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నట్టు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలాన్ని మెదక్‌ రూరల్‌ సీఐ విజయకుమార్‌, కొల్చారం ఎస్‌ఐ మహమ్మద్‌లు సందర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -