Saturday, July 12, 2025
E-PAPER
HomeNewsచారిత్రక ఆనవాళ్లను వెలికితీసేది పుస్తకం

చారిత్రక ఆనవాళ్లను వెలికితీసేది పుస్తకం

- Advertisement -

– ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
– కల్వకుర్తిలో నవతెలంగాణ పుస్తక ప్రదర్శనశాల ప్రారంభం
నవతెలంగాణ- మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి

సమాజంలో చారిత్రక ఆనవాళ్లను వెలికి తీసేది పుస్తకం అని, పుస్తకం ద్వారా సంపూర్ణ అవగాహన పెంచుకోవచ్చని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనశాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చిరిగిన చొక్కానైనా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అన్న సామెత పుస్తకం యొక్క అవసరాన్ని తెలియజేస్తుందన్నారు. డిజిటల్‌ సమాజంలో పుస్తకం ప్రాధాన్యత తగ్గిందని చాలామంది చెబుతున్నారు కానీ ఒక చారిత్రక సమాచారాన్ని తెలుసుకోవడానికి నేటికీ పుస్తకమే ప్రామాణికమని చెప్పారు. ఉన్నతమైన భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి ప్రభుత్వాలు నేటికీ పుస్తకాలను ముద్రించి ప్రచారం చేస్తున్నాయన్నారు. డాక్టర్‌ అంబేద్కర్‌, మహాత్మా గాంధీ వంటి ప్రముఖుల చరిత్రలను పుస్తకాల ద్వారా తెలుసుకుంటున్నామన్నారు.
ముఖ్యంగా రాజ్యాంగం దాని ఆవశ్యకత, చట్టాలు, వాటి అమలు, వివిధ దేశాల్లో ప్రభుత్వ పాలనా విధానాలు మనకు పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చన్నారు. డిజిటల్‌ సమాచారం అయితే టీవీలు, వాట్సప్‌లో తదితర వాటిలో ఒక్క రోజు మాత్రమే పొందుపరిచి ఉంటాయని, పుస్తకంలో అయితే ఎల్లకాలం అవసరం వచ్చినప్పుడల్లా చదివి విజ్ఞానాన్ని పెంచుకోవచ్చని చెప్పారు. ప్రతి ఒక్కరూ దినచర్యలో భాగంగా పుస్తక పఠనం చేయాలని సూచించారు. కార్యక్రమంలో నవతెలంగాణ బుకహేౌస్‌ జనరల్‌ మేనేజర్‌ వాసు, మహబూబ్‌నగర్‌ రీజియన్‌ మేనేజర్‌ కార్తీక్‌, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రాంతీయ ప్రతినిధి పరిపూర్ణం, డివిజన్‌ ఇన్‌చార్జి లక్పతి నాయక్‌, వెల్దండ రిపోర్టర్‌ రవి, కల్వకుర్తి రిపోర్టర్‌ శ్రీనివాస్‌, సీపీఐ(ఎం) నాయకులు ఏపీ మల్లయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆంజనేయులు, చింత ఆంజనేయులు, కెవి, వెంకటేశ్వర్లు, బుక్‌ స్టాల్‌ ఇన్‌చార్జీ సత్యం, మాజీ సర్పంచ్‌ ఆనంద్‌ కుమార్‌, మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ సంజీవ్‌ యాదవ్‌, ఎం.శ్రీనివాస్‌ రెడ్డి, విజరు కుమార్‌రెడ్డి, సూపరిండెండెంట్‌ శివరాం పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -