– మొదటి ముస్లిం మహిళగా రికార్డు
లద్దాక్ : ఓ ముస్లిం మహిళ అత్యున్నత శిఖరాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించింది. ముస్లిం మహిళలు పరదా చాటున ఉంటారనే మాటల్ని ఈ రికార్డుతో కొట్టిపాడేసింది. అసాధ్యమనుకున్న వాటిని అందుకుంటామని నిరూపించింది. ఆమే లద్దాక్‌కు చెందిన అబిదా అఫ్రీన్. ఇరవై ఒకటేండ్ల వయస్సున్న ఈమె ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కి మొదటి ముస్లిం మహిళగా నిలిచింది. ఎలిజెర్ జోల్డాన్ మెమోరియల్ కాలేజీలో చదువుతున్న అఫ్రీన్ మౌంట్ ఎవరెస్ట్ బాలుర, బాలికల సాహసయాత్ర 2025లో పాల్గొంది. ఈ క్రమంలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ఔరా అనిపించింది. శిఖరాన్ని ఎక్కే సమయంలో ఎదుర్కొన్న అనుభవాలు, కఠినమైన సవాళ్లను అబిదా అఫ్రీన్ వివరించింది.
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అబిదా అఫ్రీన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES