Saturday, July 12, 2025
E-PAPER
Homeజాతీయంప్రపంచ వారసత్వ జాబితాలో ‘మరాఠా మిలిటరీ లాండ్‌స్కేప్స్‌’

ప్రపంచ వారసత్వ జాబితాలో ‘మరాఠా మిలిటరీ లాండ్‌స్కేప్స్‌’

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదారాబాద్‌: మరాఠా పాలకులు నిర్మించిన పలు కోటలను ప్రఖ్యాత యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో తాజాగా చేర్చారు. పారిస్‌లో జరుగుతున్న ప్రపంచ వారసత్వ కమిటీ (డబ్ల్యూహెచ్‌సీ) 47వ సదస్సులో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు యునెస్కో శుక్రవారం ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించింది. మహారాష్ట్రలోని సాల్హేర్‌ కోట, శివ్‌నేరీ కోట, లోహ్‌గఢ్, ఖండేరీ కోట, రాయగఢ్, రాజ్‌గఢ్, ప్రతాప్‌గఢ్, సువర్ణదుర్గ్, పన్హాలా కోట, విజయ్‌దుర్గ్, సింద్‌దుర్గ్, తమిళనాడులోని జింజీ కోట ఈ ‘మరాఠా మిలిటరీ లాండ్‌స్కేప్స్‌’లో భాగంగా ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -