- Advertisement -
నవతెలంగాణ – జన్నారం : తపాలపూర్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయినిగా పని చేసి, బదిలీపై వెళ్లిన వజ్రమాల అదే పాఠశాలకు బీరువా బహుమతిగా అందజేశారు. సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళీధర్, ఉపాధ్యాయులు ఆమెను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాఠశాలలో ఆటల అనంతరం స్పోర్ట్స్ మెటీరియల్ ను & రికార్డ్స్ ను భద్రపరచడానికి బీరువా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శరిష్మా, తిరుపతి, చంద్రిక, రాజేందర్,గోపాల్, రామారావు, శ్రీనివాస్, సాయన్న, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -