Sunday, July 13, 2025
E-PAPER
Homeసినిమాహాయిగా నవ్వుకుంటారు

హాయిగా నవ్వుకుంటారు

- Advertisement -


రానా దగ్గుబాటి స్పిరిట్‌ మీడియా ప్రజెంట్‌ చేస్తున్న రూరల్‌ కామెడీ ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. కేరాఫ్‌ కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాల నటి-నిర్మాత ప్రవీణ పరుచూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్‌ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. మనోజ్‌ చంద్ర, మోనికా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 18న సినిమా విడుదల కానుంది.
డైరెక్టర్‌ ప్రవీణ పరుచూరి మాట్లాడుతూ,”కేరాఫ్‌ కంచరపాలెం’,’ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ తరువాత నేను దర్శకులిరాలిగా చేసిన ఈ సినిమా చాలా గమ్మత్తుగా ఉంటుంది. సినిమా చూస్తున్నప్పుడు చాలా హాయిగా నవ్వుకుంటారు. సెకండ్‌ హాఫ్‌లో నా స్టైల్‌లో కొన్ని సెన్సిబిలిటీ కాన్సెప్ట్స్‌ ఉంటాయి. తప్పకుండా ఆలోచన కలిగించేలా ఉంటాయి’ అని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -