రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి ‘జూనియర్’ సినిమాతో హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు. రాధా కష్ణ దర్శకత్వం వహించిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఈనెల 18న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ శనివారం మీడియాతో మాట్లాడుతూ,’నిర్మాత సాయితో నాకు మంచి పరిచయం ఉంది. ఆయనతో ‘ఈగ’ సినిమా చేశాను. డైరెక్టర్ రాధాకష్ణ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. కొత్తవారిని పరిచయం చేసినప్పుడు ఫ్యామిలీ డ్రామా జోనర్‌కి వెళ్ళరు. డాన్స్లు ఫైట్లు ఉంటే చాలు అనుకుంటారు. కానీ ఈ సినిమాలో స్ట్రాంగ్ ఎమోషన్ ఉంది. అది నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. కొత్త హీరో ఇలాంటి ఛాలెంజ్ తీసుకొని చేయడం అనేది నాకు చాలా నచ్చింది. పైగా ఇది అందరీకి కనెక్ట్ అయ్యే కంటెంట్ ఉన్న సినిమా. హీరో కిరీటి చాలా హార్డ్ వర్కర్. అద్భుతమైన డాన్సర్. యాక్షన్ చాలా బాగా చేస్తాడు. యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఇలాంటి సినిమా చేయడం నాకూ రిఫ్రెష్‌గా అనిపించింది. నాకు దర్శకత్వం చేసే ఆలోచన ఉంది. అయితే అది ఇప్పుడే కాదు. దానికి ఇంకా చాలా సమయం ఉంది’ అని తెలిపారు.
అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES