Sunday, July 13, 2025
E-PAPER
Homeఆటలుసిమ్రన్‌కు స్వర్ణం

సిమ్రన్‌కు స్వర్ణం

- Advertisement -

– ముగిసిన పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు
బెంగళూరు:
రెండ్రోజులపాటు శ్రీకంఠీరవ స్టేడియంలో జరిగిన ఇండియన్‌ పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు శనివారంతో ముగిసాయి. చివరిరోజు హర్యానా, యుపి పారా అథ్లెట్ల హవా కొనసాగింది. మహిళల టి-12 200మీ. పరుగును ఉత్తరప్రదేశ్‌కు చెందిన సిమ్రన్‌ 24.80సెకన్లలో పూర్తిచేసి బంగారు పతకాన్ని సాధించగా.. దామోర్‌ తేజల్‌ అమరాజీ(గుజరాత్‌) 25.80సెకన్లు, జానకి ఓరం(ఒడిశా) 30.00సెకన్లు రజత, కాంస్య పతకాలను చేజిక్కించుకున్నారు. తొలిరోజు 100మీ. పరుగులో స్వర్ణ పతకం సాధించిన యుపికి చెందిన ప్రీతిపాల్‌.. రెండోరోజు 200మీ. టి-35 పరుగును 31.40సెకన్లలో పూర్తిచేసి మరో బంగారు పతకాన్ని ఒడిసిపట్టుకుంది. అవని(హర్యానా) 44.20సెకన్లు, సునేత్ర(రాజస్తాన్‌) 58.50సెకన్లు రజత, కాంస్యాలను సాధించారు. ఇకపురుషుల ఫీల్డ్‌ ఈవెంట్‌లలో హర్యానా పారా అథ్లెట్ల హవా కొనసాగింది. క్లబ్‌ త్రో ఎఫ్‌32, ఎఫ్‌51లో ధరంబీర్‌ 30.37మీ. బెస్ట్‌ త్రో వేసి బంగారు పతకాన్ని సాధించగా.. ఆ రాష్ట్రానికే చెందిన ప్రణవ్‌ సూర్మా, అమిత్‌ కుమార్‌ రజత, కాంస్యాలను కైవసం చేసుకున్నారు. పురుషుల డిస్కస్‌ త్రో ఎఫ్‌-37లో హర్యానాకు చెందిన హనీ 53.81మీ. స్వర్ణ పతకం సాధించగా.. భవిషరు(హర్యానా), బాబీ(ఢిల్లీ) రజత, కాంస్యాలు సాధించారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు దేశం నలుమూలలనుంచి సుమారు 262మంది పారా అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన పారా అథ్లెట్లు న్యూఢిల్లీ వేదికగా ఏడాది జరిగే ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గోనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -