హైదరాబాద్ : వేగవంతమైన డెలివరీ సేవలను అందిస్తున్న ఇ-కామర్స్ వేదిక ఇన్‌స్టామార్ట్ 2025లో హైదరాబాద్ ఆర్డర్‌లలో 117 శాతం వృద్ధి నమోదు చేసినట్టు తెలిపింది. ముఖ్యంగా పాలు, ఎలక్ట్రానిక్స్, బొమ్మల ఆర్డర్లలో ఎక్కువ పెరుగుదల చోటుచేసుకుందని పేర్కొంది. ఒక వినియోగదారుడు ఏడాదిలో రికార్డ్ స్థాయిలో 617 ఆర్డర్‌లు చేశారని ఆ సంస్థ వెల్లడించింది. ఇడ్లీ, దోసపిండి, పాలు, పెరుగు, గుడ్లు, మామిడి వంటి నిత్యావసరాలతో పాటు, బ్యాటరీలు, ఛార్జింగ్ కేబుల్స్, విద్యా ఎల్‌సీడీ రైటింగ్ ప్యాడ్‌లు, లిప్‌బామ్‌లు, మేకప్ బ్రష్‌ల వంటి ఎలక్ట్రానిక్స్, బ్యూటీ ఉత్పత్తులు అధిక డిమాండ్‌ను నమోదు చేశాయని ఇన్‌స్టామార్ట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ హరికుమార్ జి తెలిపారు. తమ వేదిక వినియోగదారుల అవసరాలను 11 నిమిషాల సగటు డెలివరీ సమయంతో తీరుస్తోందన్నారు.