Sunday, July 13, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంజీఓ 3ను పునరుద్ధరించాలి

జీఓ 3ను పునరుద్ధరించాలి

- Advertisement -


– జనగణనలో ఆదివాసీలకు ప్రత్యేక కాలం కేటాయించాలి
– జీఓ 49 రద్దు చేయాలి : ఏఏఆర్‌ఎం జాతీయ వైస్‌ చైర్మెన్‌ మిడియం బాబురావు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ : జీవో నెంబర్‌ 3ను పునరుద్ధరించాలని ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌(ఏఏఆర్‌ఎం) జాతీయ వైస్‌ చైర్మెన్‌ డాక్టర్‌ మిడియం బాబూరావు డిమాండ్‌ చేశారు. శనివారం కలకత్తాలో జరుగుతున్న ఆ సంఘం జాతీయ సమావేశాల సందర్భంగా ఆయన ఈ మేరకు డిమాండ్‌ చేశారు. జన గణనలో ఆదివాసీలకు ప్రత్యేక ఆదివాసీ షెడ్యూల్డ్‌ ట్రైబ్‌ కాలమ్‌ను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 49ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆదివాసీల నమ్మకాలు, ఆచారాలు, సంప్రదాయాల రక్షణ కోసం రాజ్యాంగంలో నిర్దిష్టమైన నిబంధనలు ఉన్నాయని గుర్తు చేశారు. సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్‌, ఆంద్రప్రదేశ్‌ ి గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు లోత రామారావు, కిల్లో సురేంద్ర , తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం.ధర్మనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -