– 1 నుంచి 12వ తరగతి విద్యార్థుల వరకు…
– ఈ నెల15 నుంచి ‘యాక్టివ్ సీఐఎస్‌సీఈ’ పేరిట అమలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో : విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించి, శారీరక సామర్థ్యం, క్రమశిక్షణ, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ఫిట్‌నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ రీజనల్ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ ఎస్ థెరిసా తెలిపారు. ఈనెల 15వ తేదీ నుంచి 1 నుంచి 12వ తరగతి చదివే విద్యార్థులకు ‘కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (సీఐఎస్‌సీఈ) ఆధ్వర్యంలో యాక్టివ్ సీఐఎస్‌ఈసీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని వివరించారు. ఈ ప్రోగ్రామ్‌లో జాయిన్ అయ్యే విద్యార్థులు ప్రత్యేక ఫిట్‌నెస్ పోర్టల్‌లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చెప్పారు. ఈ పోర్టల్ ద్వారా స్టూడెంట్ల ఫిట్‌నెస్ స్కోర్‌లు, జీవనశైలి సూచికలు, క్రీడా నైపుణ్యాలను ట్రాక్ చేస్తారు. పీఈటీల పర్యవేక్షణలో ఆన్‌లైన్ ఫిట్‌నెస్ రిపోర్ట్ కార్డులు జారీ చేస్తారు. విద్యార్థుల బేస్‌లైన్ ఫిట్‌నెస్ స్కోర్, విద్యా సంవత్సరాల్లో పురోగతి, క్రీడా నైపుణ్య బ్యాడ్జ్‌లు, ప్రతిభ గుర్తింపును ఈ రిపోర్టులు సులభతరం చేస్తాయి. సీఐఎస్‌సీఈ అనుబంధ పాఠశాలల్లో డేటా ఏకీకరణ ద్వారా విద్యార్థుల పర్యవేక్షణను సమర్థవంతంగా నిర్వహించనున్నారు. ఐసీఎస్‌ఈ (10వ తరగతి), ఐఎస్‌సీ (12వ తరగతి) పరీక్షల రిజిస్ట్రేషన్‌కు ‘యాక్టివ్ సీఐఎస్‌సీఈ’ కార్యక్రమంలో పాల్గొనడం తప్పనిసరి షరతుగా నిర్ణయించినట్లు థెరిసా వివరించారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా 2,975 సీఐఎస్‌సీఈ అనుబంధ పాఠశాలల్లో అమలు చేస్తున్నామని తెలిపారు.
విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు ఫిట్‌నెస్ ప్రోగ్రామ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES