– ఐఐఎం కోల్‌కతా విద్యార్థినిపై క్యాంపస్‌లోనే లైంగికదాడి
– నిందితుడి అరెస్టు
కోల్‌కతా : తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పాలనలోని పశ్చిమబెంగాల్‌లో మహిళలపై దారుణాలకు సంబంధించిన వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత నెలలో న్యాయ విద్యార్థినిపై లైంగికదాడి ఘటన మరువక ముందే.. తాజాగా మరో దారుణం జరిగింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం)- కోల్‌కతాలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థినిపై క్యాంపస్‌లోనే లైంగికదాడి జరిగింది. తోటి విద్యార్థినే ఈ లైంగికదాడికి పాల్పడ్డాడు. క్యాంపస్‌లోని బార్సు హాస్టల్‌లో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు బాధితురాలు పోలీసు లకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. గత కొంతకాలంగా మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థినికి కౌన్సెలింగ్ ఇస్తానని చెప్పి అదే కళాశాలలో చదువుతున్న విద్యార్థి ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాధితు రాలిని శుక్రవారం సాయంత్రం బార్సు హాస్టల్‌కు పిలిపించుకుని అక్కడ ఆమెకు మత్తుమందు కలిపిన జ్యూస్ ఇచ్చి లైంగికదాడి చేశాడు. ఆమె స్పృహలోకి వచ్చాక తనపై లైంగికదాడి జరిగిన విషయాన్ని గ్రహించి.. ఈ విషయంపై అతడిని ప్రశ్నించింది. నిందితుడు మాత్రం బాధితురాలిపై బెదిరింపులకు దిగాడు. ఈ విషయం గురించి ఎవరికైనా చెప్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని భయపెట్టినట్టు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నది. ఈ ఫిర్యాదు మేరకు హరిదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారరం రాత్రి కేసు నమోదైంది. అఘాయిత్యానికి పాల్పడిన విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు నిందితుడికి ఈ నెల 19 వరకూ పోలీస్ కస్టడీ విధించింది.
బెంగాల్‌లో ఆందోళన కలిగిస్తున్న లైంగికదాడి ఘటనలు
బెంగాల్‌లో మహిళలపై వరుస లైంగికదాడి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. నెల క్రితం సౌత్ కోల్‌కతా లా కాలేజీ ప్రారగణంలో 24 ఏండ్ల విద్యార్థినిపై సామూహిక లైంగికదాడి, భౌతిక దాడి ఘటన మరిచిపోకముందే తాజా ఘటన జరిగింది. లా విద్యార్థినిపై టీఎంసీ విద్యార్థి సంఘం నాయకులే దారుణానికి పాల్పడటం మరింత దిగ్భ్రాంతిని కలిగించింది. అంతకుముందు 2024 ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్‌జికర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. రాష్ట్రంలో లైంగికదాడి ఘటనలపై అధికార టీఎంసీపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. ప్రభుత్వ ఉదాసీనత, నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతున్నదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
బెంగాల్‌లో మరో దారుణం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES