Sunday, July 13, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంమితిమీరుతున్నఇజ్రాయిల్‌ సెటిలర్ల ఆగడాలు

మితిమీరుతున్నఇజ్రాయిల్‌ సెటిలర్ల ఆగడాలు

- Advertisement -

– అమెరికా యువకుడిపై దాడి… హత్య
రమల్లా : ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌ లో ఇజ్రాయిల్‌ ఏర్పాటు చేసిన అక్రమ స్థావరాల్లో నివసిస్తున్న ఇజ్రాయిలీల (సెటిలర్లు) అరా చకాలు మితిమీరిపోతున్నాయి. తాజాగా ఓ అమెరికా యువకుడిని చిత్రహింసలు పెట్టి చంపేశారు. రమల్లాకు ఉత్తరాన ఉన్న సింజిల్‌ పట్టణంలో సెయిఫ్‌ అల్‌-దిన్‌ మస్లత్‌ అనే అమెరికా యువకుడిపై వారు శుక్రవారం దాడి చేసి హతమార్చారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అమెరికా లోని ఫ్లోరిడాకు చెందిన మస్లత్‌ పాలస్తీనాలోని తన కుటుంబ సభ్యు లను కలుసుకునేందుకు సింజిల్‌కు వచ్చారు. మస్లత్‌పై దాడి చేసిన సమయంలోనే మహమ్మద్‌ షలాబీ అనే పాలస్తీనీయుడిపై కూడా సెటిలర్లు కాల్పులు జరిపారు. వెస్ట్‌బ్యాంక్‌లోని ఇజ్రాయిల్‌ సెటి లర్లు పాలస్తీనా ప్రాంతాలు, పట్ట ణాలపై దాడులు చేస్తున్నారని, నివాస గృహాలు, వాహనాలను తగలబెడుతున్నారని హక్కుల కార్య కర్తలు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇజ్రాయిల్‌ సైనికులు కూడా సెటిలర్ల దురాగతాలను పట్టించు కోవడం లేదు. పైగా వారికి రక్షణగా నిలుస్తూ దాడులను ప్రతిఘటించిన పాలస్తీనియన్లపై కాల్పులు జరుపుతున్నారు. వెస్ట్‌ బ్యాంక్‌లోని ఇజ్రాయిల్‌ స్థావరాలు అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘిస్తు న్నాయని ఐరాస, మానవ హక్కుల సంఘాలు ఎప్పటి నుంచో ఆరోపి స్తున్నాయి. వెస్ట్‌బ్యాంక్‌ నుంచి పాలస్తీనీయు లను ఖాళీ చేయించడమే ఇజ్రాయిల్‌ లక్ష్యమని ఆగ్రహం వ్యక్తం చేశాయి. హింసకు పాల్పడుతున్న సెటిలర్లపై ఫ్రాన్స్‌, ఆస్ట్రేలియా వంటి కొన్ని పశ్చిమ దేశాలు ఆంక్షలు విధిం చాయి. 2023లో గాజాపై ఇజ్రా యిల్‌ దాడులు మొదలైన తర్వాత సెటిలర్ల ఆగడాలు మితిమీరిపో యాయి. గతంలో సెటిలర్లపై జో బైడెన్‌ విధించిన ఆంక్షలను ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఎత్తివేయడంతో వారి ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఇదిలావుండగా మస్లత్‌ హత్యను హమాస్‌ ఖండించింది. ఇది ఆటవిక చర్య అని మండిపడింది. కాగా ఈ ఘటనపై ‘విచారణ’ జరుపుతున్నా మని ఇజ్రాయిల్‌ చెప్పింది. ఇజ్రా యిల్‌ వాహనంపై పాలస్తీనీయులు రాళ్లు రువ్వడం హింసకు దారితీసిందని తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -