Sunday, July 13, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఅమెరికా టారిఫ్‌లపై భారత్‌ వైఖరేంటి?

అమెరికా టారిఫ్‌లపై భారత్‌ వైఖరేంటి?

- Advertisement -

– ప్రత్యామ్నాయ సచివాలయాలుగా రాజ్‌భవన్‌లు
– బీహార్‌లో ఓట్ల తొలగింపు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
– ప్రజాసమస్యలపై ఐక్య ఉద్యమాల నిర్మాణం
– సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ఎ.విజయరాఘవన్‌
– దిగుమతులతో రైతాంగానికి నష్టం : బీవీ.రాఘవులు
– స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేస్తాం : జాన్‌వెస్లీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
: అమెరికా విధిస్తున్న టారిఫ్‌లపై భారత ప్రభుత్వ వైఖరేంటో చెప్పాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ఎ విజయరాఘవన్‌ కోరారు. దీనిపై మోడీ ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం, రెండురోజులపాటు జరగనున్న రాష్ట్ర కమిటీ సమావేశాలు శనివారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్రిక్స్‌ సమావేశం తర్వాత భారత్‌పై అమెరికా సుంకాలను మరింత పెంచిందని తెలిపారు. దీని ప్రభావం దేశంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలతోపాటు వ్యవసాయంపైనా తీవ్రంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశ ప్రజల మనోభావాలకు అనుగుణంగా మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ప్రకటించాలన్నారు. అమెరికా టారిఫ్‌లపై చైనా స్పష్టమైన విధానాన్ని ప్రకటించిందని గుర్తు చేశారు.
ఉపాధి కల్పనలో విఫలం
ఉపాధి అవకాశాల కల్పనలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విజయరాఘవన్‌ విమర్శించారు. సామాన్యుల జీవన ప్రమాణాలు దిగజారాయాని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్‌ సంస్థలకు రాయితీలు ఇస్తూ, పేదలపై భారాలు వేస్తున్నారని అన్నారు. జీఎస్టీ విధానం పేదలకు అనుకూలంగా లేదనీ, నిత్యావసర వస్తువులపై అధికంగా ఉందనీ, అదే సమయంలో కార్పొరేట్లకు పన్నుల్ని తగ్గించారని గుర్తు చేశారు. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల తొమ్మిదిన జరిగిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు అన్ని వర్గాల నుంచి పెద్దఎత్తున స్పందన వచ్చిందన్నారు.
మైనార్టీలపై దాడి
దేశంలో మానవ హక్కులపై దాడి జరుగుతున్నదనీ, ముఖ్యంగా మైనార్టీలను లక్ష్యం చేసుకుంటు న్నారని చెప్తూ, పలువురు కేంద్ర మంత్రుల వ్యాఖ్యల్ని ఉదాహరించారు. అస్సాం, బెంగాల్‌లో మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయన్నారు. మావో యిస్టుల రాజకీయ విధానానికి తాము మద్దతు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. మావోయిస్టులను అంతమొందిస్తామని కేంద్రం ప్రకటించడం మానవ హక్కుల ఉల్లంఘనే అని ఆక్షేపించారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలను అస్థిరపరిచేలా గవర్నర్లు ప్రత్యామ్నాయ సచివాలయాలు నిర్వహిస్తున్నారనీ, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాద మని హెచ్చరించారు. కేరళలోని 12 విశ్వవిద్యా లయాల్లో 11 వర్సిటీలకు వైస్‌ చాన్సలర్లు లేరనీ, వారి నియమకాల విషయంలో గవర్నర్‌ అప్రజాస్వామికంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు. బీహార్‌లో ఓట్లను తొలగించడం ప్రజాస్వామ్యానికి విఘాతానికి కల్పించడమేననీ, గుర్తింపు కార్డులుగా ఆధార్‌, రేషన్‌కార్డులను ఈసీ పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు. బీజేపీ దేశాన్ని విచ్చిన్నం చేయాలని చూస్తున్నదని విమర్శించారు. ప్రజాహక్కుల పరిరక్షణ కోసం ఐక్య పోరాటాలు నిర్మిస్తామన్నారు. రాష్ట్రంలో పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలపై రాష్ట్ర కమిటీలో చర్చించి, కార్యాచరణను రూపొందిస్తామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -