– కార్బన్‌డైయాక్సైడ్‌ను గ్రహించే శక్తి తగ్గుదల
– పడిపోయిన కిరణజన్య సంయోగక్రియ సామర్థ్యం
– నేల పొడిబారటం, వేడి, నీటి ప్రభావ పరిస్థితులే కారణం
– రెండు దశాబ్దాలుగా దట్టమైన అటవీ ప్రాంతాలలో ఇవీ పరిస్థితులు
– ఐఐటీ ఖరగ్‌పూర్ తాజా అధ్యయనం
– భారత్‌లో పర్యావరణవేత్తల ఆందోళన
ప్రపంచాన్ని పట్టి పీడీస్తున్న గ్లోబల్‌వార్మింగ్ ఎఫెక్ట్, గాలి కాలుష్యం సమస్యలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. పర్యావరణంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపే ఈ సమస్యలకు ప్రధాన కారణం కర్బన ఉద్గారాలు. వీటిలో ప్రాణాంతక వాయువు కార్బన్‌డైయాక్సైడ్ ఒకటి. మానవులకు శ్వాసకోశ వంటి సమస్యలను కలిగించే ఈ వాయువు పరిమాణం రోజురోజుకూ పెరగటం ఆందోళన కలిగిస్తున్నది. అడవులను రక్షించటం, చెట్లను పెంచటం వంటి చర్యల ద్వారా పర్యావరణంలో కార్బన్‌డైయాక్సైడ్‌ను నియంత్రించవచ్చనేది సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే. అయితే, ఇప్పుడు భారత్‌లోని చెట్ల పనితీరు ఇందుకు విరుద్ధంగా ఉన్నది. దట్టమైన అటవీ ప్రాంతాల్లోని చెట్లు కార్బన్‌డైయాక్సైడ్‌ను శోషించుకునే సామర్థ్యాన్ని కోల్పోతున్నాయి. ఐఐటీ ఖరగ్‌పూర్ తాజా అధ్యయనంలో ఇది వెల్లడైంది. దీని పట్ల పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.
న్యూఢిల్లీ : భారత్‌లోని చెట్లు తమ సహజ పనితీరును కోల్పోతున్నాయి. కార్బన్‌డైయాక్సై డ్‌ను శోషించే శక్తి వాటిలో తగ్గిపోతున్నది. కిరణజన్య సంయోగక్రియ సామర్థ్యం పడిపోతున్నది. పొడిబారుతున్న నేలలు, ఉష్ణ, నీటి ప్రభావం వంటి పరిస్థితులు చెట్లలో ఇలాంటి పరిస్థితులకు కారణమవుతున్నాయి. గత రెండు దశాబ్దాలుగా దట్టణమైన అటవీ ప్రాంతాలలో ఉన్న వృక్షాలలో కిరణజన్య సంయోగక్రియ సామర్థ్యం 12 శాతానికి తగ్గిందని ఐఐటీ ఖరగ్‌పూర్ అధ్యయనంలో వెల్లడైంది. చెట్లలో కిరణజన్య సంయోగక్రియ అనే ప్రక్రియ కీలకమైనది. దీని ద్వారా వృక్షాలు తమంతట తామే ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఇందులో భాగంగా అవి కార్బన్‌డైయాక్సైడ్‌ను స్వీకరించి, మానవులు, ఇతర జీవరాశులకు అవసరమైన ప్రాణవాయు వు ఆక్సీజన్‌ను విడుదల చేస్తాయి. అయితే, భారత్‌లోని అడవులలో వృక్షాలకు కార్బన్‌డైయా క్సైడ్‌ను శోషించుకునే సామర్థ్యం తగ్గిందని తాజా అధ్యయనంలో వెల్లడి కావటం ఆందోళన కలిగించే అంశమని పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు అంటున్నారు.
వాతావరణ మార్పులను
ఎదుర్కోవటంలో భారత్‌కు కొత్త సవాల్
భారతీయ అడవులలో కిరణజన్య సంయోగ క్రియ సామర్థ్యం తగ్గుదలను నేల పొడిబారడం, వేడి పరిస్థితులు, నీటి వినియోగ సామర్థ్యం తగ్గటంతో ఈ అధ్యయనం ముడిపెట్టింది. అడవులలో పెరుగుతున్న పచ్చదనం ఎక్కువ కార్బన్ శోషణకు దారితీయదని మునుపటి పరిశోధనలను ఈ అధ్యయనం ధృవీకరించటం గమనార్హం. ఈ విధంగా అటవుల సామర్థ్యం తగ్గిపోవటమనేది వాతావరణ మార్పులను ఎదుర్కోవటంలో భారత్‌కు ఒక కొత్త సవాలు అని ఈ అధ్యయనాన్ని నిర్వహించిన ఐఐటీ ఖరగ్‌పూర్‌కు చెందిన శాస్త్రవేత్తలు అంటున్నారు. పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు, పశ్చిమ హిమాలయాలలోని కొన్ని దట్టమైన అటవీ ప్రాంతాల్లో కిరణజన్య సంయోగక్రియ సామర్థ్యం దారుణంగా పడిపోవటం చూస్తున్నామనీ, ఇది బాధాకరమైన విషయమని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన జయనారాయణ్ కుత్తిప్పురాత్ అన్నారు.
అటవీ విస్తీర్ణం పెరిగినా కార్బన్ శోషణ ఎంత?
భారత్‌లో అటవీ విస్తీర్ణ అంచనాలకు సంబంధించి గతేడాది డిసెంబర్‌లో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం దేశ అటవీ విస్తీర్ణం పెరిగింది. 2021 నుంచి 2023 మధ్య 1445 చదరపు కిలోమీటర్ల పెరుగుదలను నమోదు చేసింది. భారత భూభాగంలో దాదాపు 25 శాతం ప్రాంతాన్ని అటవీ, చెట్లు కవర్ చేస్తున్నాయి. అయితే, ఈ కొత్త పరిశోధన ఇప్పుడు దేశంలోని అడవులు గ్రహించే కార్బన్ పరిమాణంపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
సత్తువ కోల్పోతున్న చెట్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES