Monday, July 14, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకోట శ్రీనివాసరావు మృతి పట్ల కేసీఆర్, కేటీఆర్ సంతాపం

కోట శ్రీనివాసరావు మృతి పట్ల కేసీఆర్, కేటీఆర్ సంతాపం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivasarao) మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR), మాజీ మంత్రి కేటీఆర్(KTR) సంతాపం వ్యక్తం చేశారు. విభిన్న పాత్రలను పోషించి, ప్రేక్షక హృదయాల్లో తన స్థానాన్ని పదిలపరుచుకున్న విలక్షణ వెండితెర నటుడు కోట శ్రీనివాసరావు అని కేసీఆర్ అన్నారు. ఆయన మరణంతో సినీమా రంగం ఒక గొప్ప నటున్ని కోల్పోయిందని కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. కోట శ్రీనివాసరావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ ప్రార్థించారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

‘ఈ దుఃఖ సమయంలో కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అని కేటీఆర్ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -