Wednesday, August 13, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుప్రధాని మోడీని కలిసిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

ప్రధాని మోడీని కలిసిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఘోర ఉగ్రదాడిపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన కొద్దిసేపటికే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్‌తో సమావేశమయ్యారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని ప్రధాని అధికారిక నివాసం 7, లోక్ కళ్యాణ్ మార్గ్‌లో వీరి భేటీ జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఆర్ఎస్ఎస్ కీలక సమావేశాల్లో పాల్గొనేందుకు మోహన్ భగవత్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రధానితో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన తరుణంలో ఈ భేటీ జరిగింది. గత వారం ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసరన్ మైదానంలోకి చొరబడిన పాకిస్థాన్ ఆధారిత లష్కరే తోయిబాకు చెందిన ఐదారుగురు ఉగ్రవాదులు పర్యాటకులపై లక్ష్యంగా దాడి చేసి 26 మందిని పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే.
కాగా, పహల్గాం మారణహోమానికి బాధ్యులైన వారిపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని మోహన్ భగవత్ గత వారం ఓ బహిరంగ కార్యక్రమంలో పిలుపునిచ్చారు. “మేము బలమైన ప్రతిస్పందనను ఆశిస్తున్నాము. మతం అడిగి మరీ ప్రజలను చంపారు. హిందువులు ఎప్పటికీ అలాంటి పని చేయరు. మా హృదయాల్లో బాధ ఉంది. మేము ఆగ్రహంతో ఉన్నాము,” అని ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి పేరును నేరుగా ప్రస్తావించకుండా, ప్రజలను రక్షించడం రాజు విధి అని భగవత్ అన్నారు. “మనం పొరుగువారిని ఎప్పుడూ అవమానించం, హాని చేయం. కానీ ఎవరైనా చెడు మార్గంలోకి వెళితే, మరో మార్గం ఏమిటి? ప్రజలను రక్షించడం రాజు కర్తవ్యం. రాజు తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. దుండగులకు బుద్ధి చెప్పడం కూడా విధిలో భాగమే” అని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img