నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ : ప్రభుత్వ ఫార్మసిస్టులను ఇకనుంచి ఫార్మసీ ఆఫీసర్గా పేరు మారుస్తూ 25 ఏప్రిల్ 25 రోజున జీవోఎంఎస్ నెంబర్ 71 హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా టిజిపిఏ కార్యవర్గ సమావేశం నిర్వహించి ఫార్మసిస్టులను ఫార్మసీ ఆఫీసర్లుగా మార్చడంపై హర్షం వ్యక్తం చేశారు. ఉత్తర్వులు అందజేసిన ప్రిన్సిపల్ సెక్రెటరీ డాక్టర్ క్రిస్టినా జడ్ చొoగ్త్, హెల్త్ డైరెక్టర్ రవీంద్ర నాయక్ లకు కృతజ్ఞతలు తెలిపారు. వెలువడానికి కారణమైన టిజిపిఏ రాష్ట్ర అధ్యక్షులు బత్తిని సుదర్శన్ కు రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో యాదాద్రి భువనగిరి జిల్లా టిజిపి అధ్యక్షులు కే శ్రీనివాస్, కార్యదర్శి చందా సరిత, కోశాధికారి శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు బి నరసింహారావు లు పాల్గొన్నారు.