Monday, July 14, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్రక్తం కక్కుకుని చస్తారు..

రక్తం కక్కుకుని చస్తారు..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు వేడుకల్లో భాగంగా రంగం, భవిష్యవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. పచ్చికుండపై నిలబడి మాతంగి స్వర్ణలత భవిష్యవాణి చెప్పారు. ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవంతో సంతృప్తి చెందావా.. అని అర్చకులు ఆమెను ప్రశ్నించారు. అందుకు మాతంగి స్వర్ణలత సమాధానం చెబుతూ.. ప్రజలంతా డప్పుచప్పుళ్లతో ఆనందోత్సాహాల నడుమ తనకు బోనాలు సమర్పించారని తెలిపారు. వచ్చిన ప్రతి బోనాన్ని తాను సంతోషంగా అందుకున్నానని పలికింది.

కానీ, ప్రతి ఏటా ఉత్సవానికి ఏదో ఒక ఆటంకం కల్పిస్తున్నారని.. తనను ఎవరూ లెక్కచేయడం లేదని చెప్పారు. తల్లిదండ్రులు వాళ్ల పిల్లలను విచ్చలవిడిగా వదిలేస్తున్నారని.. ప్రజలందరినీ తన కన్నబిడ్డల్లా చూసుకుంటూ కాపాడుకుంటున్నానని పలికింది. ఈ ఏడాది వర్షాలు తప్పకుండా కురుస్తాయని, పంటలు సమృద్ధిగా పండుతాయని తెలిపారు. రాసుల కొద్దీ సంపదను తాను రప్పించుకుంటున్నా.. గోరంతైనా తనకు దక్కడం లేదని, సక్రమంగా పూజలు జరిపించాలి బాలకా అంటూ అమ్మవారు ఆగ్రహించింది. తాను కన్నెర్ర జేస్తే… రక్తం కక్కుకుని చస్తారంటూ హెచ్చరించింది.

కాలానుగుణంగా ఎవరు ఏది అనుభవించాలో అది అనుభవిస్తారు, తాను అడ్డురానని స్వర్ణలత తెలిపింది. ఏడాది ఒక్కసారి కాదు.. నిత్యం కొలిచే వారికే తన ఆశీస్సులు ఉంటాయని మాతంగి స్వర్ణలత భవిష్యవాణి చెప్పింది. ఆ ప్రశ్నలకు ఆలయ ప్రధానార్చకుడు సమాధానమిస్తూ.. ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా తాము దగ్గరుండి పూజలు చేయిస్తున్నానని తెలిపారు. ఇక నుంచి ఎలాంటి లోటుపాట్లు, పొరపాట్లు జరగనివ్వమబోమని.. ఆనందించి తమను ఆశీర్వదించాలని అమ్మవారిని వేడుకున్నారు. దీంతో అమ్మవారు పూనిన మాతంగి స్వర్ణలత శాంతించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -