Monday, July 14, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమహిళా కమిషన్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత..

మహిళా కమిషన్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఎమ్మెల్సీ కవితపై, ఎమ్మెల్సీ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. బీసీలకు రాష్ట్ర ప్రభుత్వ 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు వ్యవహారంలో ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఎమ్మెల్సీ మల్లన్న ఓ సభలో కవిత పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహించిన తెలంగాణ జాగృతి నేతలు .. ఆదివారం ఎమ్మెల్సీ మల్లన్న న్యూస్ ఛానెల్ పై దాడి చేశారు. అయితే ఈ దాడి అనంతరం ఇరు వర్గాలు పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం కవితపై మల్లన్న చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసేందుకు జాగృతి మహిళా నేతలు పెద్ద ఎత్తున మహిళా కమిషన్ ఆఫీస్ వద్దకు చేరుకున్నారు. అయితే వారిని లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారంతా కొద్ది సేపు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కమిషన్ అధికారులు అందుబాటులో లేరని చెప్పడంతో వారంత అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -