Tuesday, July 15, 2025
E-PAPER
Homeతాజా వార్తలుపదేళ్లు అవకాశం ఇచ్చినా నీళ్లు తేలేదు : సీఎం రేవంత్ రెడ్డి

పదేళ్లు అవకాశం ఇచ్చినా నీళ్లు తేలేదు : సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : రేషన్‌ కార్డు పేదవాడి ఆత్మగౌరవం.. గుర్తింపు.. ఆకలి తీర్చే ఆయుధమని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో నిర్వహించిన నూతన రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. నల్గొండ చరిత్రే.. తెలంగాణ చరిత్ర అంటే అతిశయోక్తి కాదన్నారు. ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి నేతలపై సీఎం విమర్శలు చేశారు.

‘‘పదేళ్లు అధికారంలో ఉన్నా పేదలకు రేషన్‌ కార్డు, సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచన భారత రాష్ట్ర సమితి నేతలకు రాలేదు. మా ప్రభుత్వం 3.10 కోట్ల మందికి సన్న బియ్యం ఇస్తే రేషన్‌ దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. వ్యవసాయం దండగ కాదు.. పండగ అని గిట్టుబాటు ధరతో పాటు బోనస్‌ ఇచ్చాం. దేశం తలెత్తుకునేలా వరి ధాన్యం ఉత్పత్తి చేస్తున్నాం. ప్రతిపక్ష పార్టీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు గోదావరి నీళ్లు ఇవ్వలేదు.. ఇప్పుడు సీఎం వస్తే అడ్డుకుంటామంటున్నారు. గతంలో 3 రోజులు అవకాశమిస్తే తుంగతుర్తికి జలాలు తెస్తామన్నారు. పదేళ్లు అవకాశం ఇచ్చినా దేవాదుల నుంచి నీళ్లు తేలేదు’’ అని రేవంత్‌ విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -