నవతెలంగాణ హైదరాబాద్: మలక్‌పేటలో కాల్పుల ఘటన నగరంలో కలకలం రేపుతోంది. శాలివాహన నగర్ పార్క్‌లో వాకింగ్ కు వెళ్లిన సీపీఐ రాష్ట్ర నాయకులు చందు నాయక్(53)పై గుర్తు తెలియని దండుగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో చందునాయక్ అక్కడికక్కడే మృతి చెందారు. కారులో వచ్చిన దుండగులు చందునాయక్‌పై ఆరు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఆ సమయంలో చందు నాయక్ తోపాటు ఆయన భర్య, కుమార్తెతో కూడా ఉన్నారు. శాలివాహన నగర్ పార్క్‌లో అందరూ చూస్తుండగానే కాల్పుల ఘటన చోటు చేసుకుంది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
సీపీఐ రాష్ట్ర నాయకులు చందు నాయక్ స్వస్థలం నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండలం నర్సాయిపల్లి. భూ తగాదాల కారణంగానే హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. క్లూస్ టీమ్ ఘటనా స్థలికి చేరుకొని ఆధారాలు సేకరించింది. కొనేండ్ల క్రితమే చందు నాయక్ సీపీఐ(ఎంఎల్) నుంచి సీపీఐలో చేరారు. 2022లో ఎల్బీనగర్ పరిధిలో జరిగిన హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు. మరో వైపు కాల్పులు జరిపిన రాజేశ్, సుధాకర్ మరో ఇద్దరు నిందితులు ఎస్‌వోటీ పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు సమాచారం.