నవతెలంగాణ-హైదరాబాద్: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మంగళవారం భారత విదేశాంగ శాఖామంత్రి జైశంకర్ భేటి అయ్యారు. జైశంకర్ రెండు రోజుల పర్యటనలో భాగంగా.. సోమవారం జైశంకర్ చైనాకు చేరుకున్నారు. మంగళవారం ఆ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌తో జైశంకర్ భేటీ అయ్యారు. జిన్‌పింగ్‌తో కలిసి దిగిన ఫొటోను ఆయన తన ఎక్స్ పోస్టులో షేర్ చేశారు. ఇరు దేశాల నేతల చర్చల్లో చైనా – భారత్ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. జైశంకర్‌తోపాటు షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సిఓ) సభ్యులు కూడా జిన్‌పింగ్‌ని కలిశారు. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ జైశంకర్‌కి శుభాకాంక్షలు తెలిపారు.
కాగా, 2020లో వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) వెంబడి గాల్వాన్ లోయ ఘర్షణ ఉద్రికత్తల తర్వాత జై శంకర్ చైనాను సందర్శించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో జైశంకర్ భేటి
- Advertisement -
- Advertisement -