- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: యాక్సియం-4 మిషన్‌లో భాగంగా అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసి భూమికి చేరుకున్న వింగ్ కమాండర్ శుభాన్ష శుక్లాను ప్రధాని మోడీ అభినందించారు. ఈ రోజు చరిత్రలో ఓ మైలురాయిగా లిఖించబడుతుందన్నారు. అంతరిక్ష యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసిన మొదటి భారతీయుని శుక్లా గుర్తించబడ్డారని, ఆయనకు ఇదే తమ స్వాగతమని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆయన తన అంకితభావం, ధైర్యం, మార్గదర్శక స్ఫూర్తి ద్వారా బిలియన్ల కలలను ప్రేరేపించారని, మరో మైలురాయి గగన్‌యాన్ సూచిస్తుందని ప్రధాని ప్రశంసించారు.
- Advertisement -