నవతెలంగాణ-హైదరాబాద్: త్రిభాష సూత్రంతో హిందీని ప్రధాన భాషగా మార్చాలని బీజేపీ పాలిత రాష్ట్రాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈక్రమంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో హిందీ కాకుండా వేరే భాష మాట్లాడే వ్యక్తులపై ఇటీవల కాలంలో దాడులు పెరిగిపోతున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రంలో మరాఠీ మాట్లాడలేదని ఓ బెంగాలీ పలువురు తీవ్రంగా దాడి చేశారు. ఈ తరహా సంఘటనలు మీతిమిరిపోతున్నాయి. దీంతో బెంగాలీలే లక్ష్యగా జరుగుతున్న దాడులపై సీఎం మమతా బెనర్జీ కన్నెర్రా జేశారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలు బెంగాల్ కి చెందిన పౌరులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నాయని టీఎంసీ ఆరోపించింది.
ఇవాళ కోల్‌కతా నడిబొడ్డున సుమారు 3 కిలోమీటర్ల పొడవునా భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీతో సహా అధికార తృణమూల్ కాంగ్రెస్ అగ్ర నాయకులందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడే ప్రజలను వేధిస్తున్నారని ఆరోపణలు గుప్పించింది. మతం, కులం, భాష ఆధారంగా ప్రజలను విభేజించే ప్రయత్నాలు సిగ్గుచేటని ఆమె మండిపడ్డారు.
అయితే, ఒడిశాలోని ఝార్సుగూడలో 444 మంది అనుమానిత బంగ్లాదేశ్ జాతీయులను ఇటీవల అదుపులోకి తీసుకోవడంతో తీవ్ర నిరసనకు దారి తీసింది. వారిలో 200 మంది బెంగాల్ నుంచి వలస వచ్చిన కార్మికులు ఉన్నారని తృణమూల్ కాంగ్రెస్ పేర్కొంది. అలాగే, ఢిల్లీలో కూడా బెంగాల్ వాసుల బహిష్కరణ డ్రైవ్‌లు కొనసాగుతున్నట్లు పలు నివేదికలు బయటకు వస్తున్నాయని బీజేపీపై టీఎంసీ తీవ్రమైన ఆరోపణలు చేసింది. కాగా, వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే పశ్చిమ బెంగాల్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. దీంతో బీజేపీ ఆధ్వర్యంలోని పలు రాష్ట్రాల్లో బెంగాల్ పౌరులపై వేధింపుల అంశాన్ని తెర పైకి తీసుకొచ్చింది తృణముల్ కాంగ్రెస్ పార్టీ.