Tuesday, April 29, 2025
Homeసినిమాప్రేక్షకులకు థ్యాంక్స్‌

ప్రేక్షకులకు థ్యాంక్స్‌

ప్రదీప్‌ మాచిరాజు, దీపికా పిల్లి జంటగా నటించిన చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. డైరెక్టర్స్‌ డుయో నితిన్‌, భరత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మాంక్స్‌ అండ్‌ మంకీస్‌ బ్యానర్‌ నిర్మించింది. ఇటీవల థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకి ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ, సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్‌ నిర్వహించిన సక్సెస్‌ మీట్‌లో హీరో ప్రదీప్‌ మాట్లాడుతూ,’ఈనెల 11 మా జీవితంలో మర్చిపోలేని రోజు. మా చిత్రాన్ని ప్రేక్షకులు చూసిన రోజు అది. ఫస్ట్‌ ఫ్రేమ్‌ నుంచి లాస్ట్‌ ఫ్రేమ్‌ వరకు ప్రేక్షకుల పెదవులపై నవ్వు ఉంటుందని ప్రామీస్‌ చేశాను. ఆ ప్రామీస్‌ని నిలబెట్టుకున్నాం. మైత్రి శశి మా టీంకి బిగ్గెస్ట్‌ స్ట్రెంత్‌. మా బ్యానర్‌లో ఫస్ట్‌ సినిమా మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో రిలీజ్‌ కావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రీమియర్స్‌ నుంచి సినిమాకి చాలా అద్భుతమైన రెస్పాన్స్‌ ఉంది. ఆడియన్స్‌ ఎంజారు చేస్తున్నారు. ఆడియన్స్‌ థియేటర్స్‌లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది. థియేటర్స్‌ నుంచి బయటికి వస్తున్న ప్రతి ఒక్కరి ఫేస్‌లో స్మైల్‌ ఉంది. ఇంత మంచి కథని తీసుకొచ్చిన మా డైరెక్టర్‌ నితిన్‌, భరత్‌కి థ్యాంక్యూ. ఈ సమ్మర్లో మంచి తెలుగు సినిమా చూసి నవ్వుకుందాం అని భావించే ప్రతి ఫ్యామిలీని మా సినిమాకి ఆహ్వానిస్తున్నాం’ అని అన్నారు. ‘ఆడియన్స్‌ తో కలిసి సినిమా చూసాం. వాళ్ళు నవ్వుతుంటే అసలైన కిక్‌ వచ్చింది. మేం పడిన కష్టానికి ఫలితం నిన్న చూసుకున్నాం. డే వన్‌ నుంచి క్లీన్‌ కామెడీతో ఫ్యామిలీస్‌ అందరినీ నవ్విస్తామని చెప్పాం. అది చేశాను’ అని డైరెక్టర్‌ భరత్‌ చెప్పారు. మరో డైరెక్టర్‌ నితిన్‌ మాట్లాడుతూ,’ మా కంఫర్ట్‌ జోన్‌ని వదులుకొని చేసిన ప్రయత్నం ఇది. ఈ ప్రయత్నానికి మీరు ఇంత అద్భుతమైన రెస్పాన్స్‌ ఇవ్వడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. సినిమాకి చాలా అద్భుతంగా రెస్పాన్స్‌ వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరూ స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు నవ్వుకుంటున్నామని చెప్పారు. ఈ అవకాశం ఇచ్చిన ప్రదీప్‌కి థ్యాంక్యూ. ఆయన సపోర్ట్‌ లేకపోతే ఇక్కడ వరకు వచ్చేవాళ్ళం కాదు. అందరం కలిసి చాలా మంచి సినిమా చేశాం. అందరూ థియేటర్స్‌కి వచ్చి హ్యాపీగా ఎంజారు చేయండి’ అని తెలిపారు. ‘మా సినిమాకి ఇంత మంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడం చాలా ఆనందంగా ఉంది. థియేటర్స్‌కి వెళ్లి సినిమా చూసాం. ఆడియన్స్‌ రెస్పాన్స్‌ చూస్తుంటే చాలా హ్యాపీనెస్‌ ఇచ్చింది’ అని హీరోయిన్‌ దీపికా పిల్లి చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img