ఇరాన్ సుప్రీం లీడర్
టెహరాన్ : అమెరికా, ఇజ్రాయిల్‌లపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇజ్రాయిల్ నేరాల్లో అమెరికా భాగస్వామి అని మండిపడ్డ ఆయన.. టెల్ అవీవ్ ఓ క్యాన్సర్ కణితి వంటిదన్నారు. వాషింగ్టన్ చెప్పుచేతల్లో నడుచుకుంటుందని ధ్వజమెత్తారు. ఇజ్రాయిల్‌తో కాల్పుల విరమణ ఒప్పందం జరిగి, అటు అమెరికాతో అణు చర్చలు జరపనున్న వేళ సుప్రీం లీడర్ ఈ విధంగా స్పందించారు.
అమెరికా, ఇజ్రాయిల్‌తో గొప్పగా పోరాటం చేశామన్న సుప్రీం లీడర్.. మళ్లీ ఎలాంటి దాడులు జరిగినా దీటుగా ప్రతిస్పందించేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందన్నారు.
ఇటీవల 12 రోజుల పాటు జరిగిన యుద్ధంలో జోక్యం చేసుకున్న అమెరికా.. ఇరాన్‌లో అణు కేంద్రాలే లక్ష్యంగా దాడులు జరిపిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఇరాన్‌కు చెందిన అనేక మంది అణు శాస్త్రవేత్తలు, వందలాది మంది పౌరులను నెతన్యాహు సైన్యం అంతమొందించింది. మొత్తంగా దాదాపు 1060 మంది చనిపోయినట్టు అంచనా. వీటికి ప్రతిస్పందనగా ఇరాన్ కూడా ఇజ్రాయిల్‌పై డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరిపింది. ఆ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా దాడులు చేయడం, అనంతరం ఇజ్రాయిల్-ఇరాన్‌లు కాల్పుల విరమణకు అంగీకరించిన విషయం తెలిసిందే.
ఇజ్రాయిల్ ఓ క్యాన్సర్ కణితి లాంటిది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES