Sunday, July 20, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంజీవో 49ను రద్దు చేయాలి

జీవో 49ను రద్దు చేయాలి

- Advertisement -

టైగర్‌ కన్జర్వేషన్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ ఏర్పాటును విరమించుకోవాలి : ప్రజాసంఘాల పోరాట వేదిక
రాష్ట్ర నాయకులు బండారు రవికుమార్‌ డిమాండ్‌
నవతెలంగాణ-ఉట్నూర్‌
కుమురం భీం-ఆసిఫాబాద్‌ జిల్లాలో టైగర్‌ కన్జర్వేషన్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ ఏర్పాటును విరమించుకొని, జీఓ 49ను రద్దు చేయాలని ప్రజా సంఘాల వేదిక రాష్ట్ర నాయకులు బండారు రవికుమార్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌లోని హెచ్‌కేజీఎన్‌ ఫంక్షన్‌ హాల్‌లో బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామసభలు నిర్వహించకుండా.. ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోకుండా, పీసా చట్టం అమలు చేయకుండా జీఓ తీసుకురావడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఆదివాసీ గ్రామాలకు ఐటీడీఏ ద్వారా మంజూరైన బోర్లు, త్రీఫేజ్‌ కరెంట్‌, రహదారులు వేయకుండా అటవీ శాఖ అధికారులు అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ద్వారా మంజూరైన ఇందిరమ్మ ఇండ్లను కూడా కట్టనీయడం లేదన్నారు. ఇప్పటికే కవ్వాల్‌ టైగర్‌ జోన్‌ పేరుతో ఆదివాసుల అభివృద్ధికి ఎన్నో ఆంక్షలు పెట్టి అడ్డుపడుతున్నారని, మళ్లీ జీఓ 49 టైగర్‌ కన్జర్వేషన్‌ పేరుతో వారి మనుగడను ప్రశ్నార్థకం చేసే ప్రయత్నాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మానుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో ప్రజాసంఘాల పోరాట వేదిక నాయకులు భూపాల్‌, ఉడత రవీందర్‌, పైళ్ల ఆశయ్య, దర్శనాల మల్లేష్‌, కూశన రాజన్న, పూసం సచిన్‌, ఎర్మ పున్నం, తొడసం శంభు, అన్నమొల్ల కిరణ్‌, బొజ్జ ఆశన్న, కోట శ్రీనివాస్‌, అశోక్‌, ఆత్రం తనుష్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -