ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్
గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను
తనిఖీ చేసిన ఎమ్మెల్యే, ఆర్డీఓ
నవతెలంగాణ- దేవరకొండ
ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులకు నాణ్యమైన భోజనం పెట్టాలని ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం ముదిగొండ (కమలాపూర్) ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను బుధవారం ఆర్డీఓ రమణారెడ్డితో కలిసి ఎమ్మెల్యే తనిఖీ చేశారు. హాస్టల్, పాఠశాల పరిసరాలు, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పాఠశాల పరిసరాలు నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. పిచ్చి మొక్కలు తొలగించాలన్నారు. విద్యార్థినులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని, వాటిని సాధించే దిశగా కృషి చేయాలని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే, ఆర్డీఓ విద్యార్థినులతో కలిసి ఉదయం అల్పాహారం చేశారు. వారి వెంట ఎంపీడీఓ డానియల్, సీఐ నరసింహులు, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కొర్ర రాంసింగ్ నాయక్ తదితరులు ఉన్నారు.
విద్యార్థినులకు నాణ్యమైన భోజనం పెట్టాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES