Saturday, July 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపెండింగ్‌ ఉపకార వేతనాలు చెల్లించాలి

పెండింగ్‌ ఉపకార వేతనాలు చెల్లించాలి

- Advertisement -

ఆరేండ్లుగా విద్యార్థుల బకాయిలు చెల్లించని ప్రభుత్వం
మంత్రులు, ఎమ్మెల్యేల బకాయిలు ఒక్కరోజైనా ఆపారా?
గత ప్రభుత్వం మాదిరే కాంగ్రెస్‌ వైఖరి : ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.నాగరాజు
శంషాబాద్‌లో భారీ ర్యాలీ

నవతెలంగాణ-శంషాబాద్‌
పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వెంటనే విడుదల చేయాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు ఉధృతం చేస్తామని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.నాగరాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆరేండ్ల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు రావాల్సిన రూ.8,158 కోట్లు పేరుకు పోయాయని తెలిపారు. బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కెవై.ప్రణరు ఆధ్వర్యం లో శంషాబాద్‌లో బుధవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. శంషాబాద్‌ జాతీయ రహదారి-44 బస్‌స్టేషన్‌ నుంచి అంబేద్కర్‌ చౌరస్తా చేరుకుని అక్కడ రోడ్డుపై బైటాయించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. విద్యార్థుల ఆగ్రహానికి గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారం కోల్పోయింద న్నారు. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉంటూ విద్యార్థుల సమస్యలు పట్టించు కోవడం లేదన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా బకాయిలు చెల్లించ లేదన్నా రు. ప్రతిపక్షంలో ఉన్న ప్పుడు విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తామని, బకాయిలు విడుదల చేస్తామని అనేక వేదికల్లో మాట్లాడిన ప్రస్తుత సీఎం.. ఎందుకు బకాయిలు విడుదల చేయడం లేదో చెప్పాలన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు, సీఎంకు ఒక్క నెల వేతనం అయినా ఆపుతున్నారా అంటూ ప్రశ్నించారు. ఉపకార వేతనాలందక ప్రయివేటు విద్యాసంస్థలు విద్యార్థుల ను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజులు చెల్లించలేని విద్యార్థులు చదువు మధ్యలో ఆపి, పనులకు వెళ్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అనేకమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటు న్నారని తెలిపారు. విద్యారంగ సమస్యలు చెప్పుకోవ డానికి సీఎం అపాయిం ట్మెంట్‌ కూడా దొరకడం లేద న్నారు. విద్యార్థులపై నిర్బంధాలు కొనసాగిస్తే సహించేది లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉపకార వేతనాలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే సెక్రటేరియట్‌, సీఎం క్యాంప్‌ ఆఫీసు, చలో హైదరాబాద్‌ కార్య క్రమాలు చేపడతా మని హెచ్చరించారు. ఎస్‌ఎఫ్‌ఐ రంగారెడ్డి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కెవై.ప్రణరు, శంకర్‌ మాట్లా డుతూ ఈ ఆందోళన ఆరంభం మాత్రమేనని అన్నారు. జిల్లాలో సుమారు రూ.750 కోట్లు స్కాలర్‌ షిప్‌ పెండింగ్‌లో ఉందని తెలిపారు. ప్రభుత్వం స్పందించి బకాయిలు విడుదల చేయ కుంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీకాంత్‌, చరణ్‌, అరుణ్‌, వంశీ, తరంగ్‌, విప్లవ్‌, చరణ్‌, ప్రసాద్‌, కౌశిక్‌, తనిష్క, తరుణ్‌, ఉదరు, శ్రీను, సాయి, హర్ష, సతీష్‌, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -