Saturday, July 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవిద్య అంతిమ లక్ష్యం సృజనాత్మకతచారిత్రాత్మకమైన అభివృద్ధి సాధించాలి

విద్య అంతిమ లక్ష్యం సృజనాత్మకతచారిత్రాత్మకమైన అభివృద్ధి సాధించాలి

- Advertisement -

స్నాతకోత్సవం.. భవిష్యత్‌ ప్రయాణానికి మార్గనిర్దేశం : గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ
టీయూలో అట్టహాసంగా రెండో స్నాతకోత్సవం

నవతెలంగాణ-నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
”సర్వేపల్లి రాధాకృష్ణ చెప్పినట్టు విద్య అంతిమ లక్ష్యం సృజనాత్మకమైన మానవున్ని తయారు చేయడంతోపాటు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటూ చారిత్రాత్మకమైన అభివృద్ధిని సృశించడం. 2023-24 రాష్ట్ర ఆర్థిక సర్వే ప్రకారం 51 శాతం పట్టభద్రులు దేశానికి నైపుణ్యాల కొరత తీరుస్తూ ఉద్యోగాలు పొందుతున్నారు. తెలంగాణ యూని వర్సిటీ ఆశాజనక.. పారిశ్రామిక విద్యాపరమైన సంబంధాల తో ముందుకు పోవడం స్వాగతించాల్సిందే..’ అని రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేశ్‌ వర్మ అన్నారు. నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీలో బుధవారం 2వ స్నాతకోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. యూనివర్సిటీ ల చాన్స్‌లర్‌, రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేశ్‌ వర్మ పాల్గొన్నారు. 2014 నుంచి 2023 వరకు 15 విభాగాల్లో 132 మంది విద్యార్థులకు బంగారు పతకాలందజేశారు. 156 మంది పరిశోధకులకు డాక్టరేట్‌ పట్టాలు అందజేశారు. అంతకు ముందు గవర్నర్‌ ప్రసంగిస్తూ.. తెలంగాణ విశ్వ విద్యాల యానికి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని గర్వంగా చెప్తున్నానని తెలిపారు. చైతన్యవంతమైన ఈ మట్టిలోని ప్రజల ఆకాంక్షలు, సామర్థ్యాలు విశ్వవిద్యాలయ అభివృద్ధిలో స్ఫూర్తినిస్తున్నాయన్నారు. ఈ విశ్వవిద్యాలయం సాధించిన విజయాలు, విశేష మైన ప్రగతిపూర్వకమైన సంఘటనలు రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. స్నాతకోత్సవం విద్యాపరమైన లక్ష్య సాధన మాత్రమే కాదని.. నాణ్యమైన, సాంకేతిక విద్య, ఉపాధి కల్పించే భవిష్యత్‌ ప్రయాణానికి మార్గాన్ని నిర్దేశిస్తుందన్నారు. దేశ భవిష్యత్‌ తరగతి గది లోనే తీర్చిదిద్ద బడుతుందనేది విశ్వ విద్యాలయ విజయాలు రుజువు చేస్తున్నాయని చెప్పారు. భారత రసాయన శాస్త్ర సాంకేతిక సంస్థ మాజీ డైరెక్టర్‌ ఆచార్య శ్రీవారి చంద్రశేఖర్‌ మాట్లాడుతూ..విశ్వ విద్యాల యం నుంచి బయటకు వెళ్లిన ప్రతి విద్యార్థికీ ఆందోళనతో పాటు అవకాశాలు కనిపిస్తాయ న్నారు. ఆందోళన చెంద కుండా అవకాశాల వైపు పరిగెత్తా లని సూచించారు. వర్తమాన కాలంలో అనేక అవకాశాల తో తమ నైపుణ్యాలను, అభిరుచులను ఉపయోగించుకొని అనేక రకాలుగా స్థిరపడే అవకాశం ఉందన్నారు. జీవిత మనేది పందెం లాంటిది కాదని.. ఇది ఒక ప్రయాణం మాత్రమేనని గుర్తుంచు కోవాలని చెప్పారు. ఈ ప్రయాణా నికి సమయస్ఫూర్తి, లోతైన అధ్యయనంతోపాటు తీసుకునే నిర్ణయాల మీద భవిష్యత్‌ నిర్ణయం జరుగుతుందని తెలిపారు. టీయూ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొ.యాదగిరిరావు మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో కొన సాగుతున్న కోర్సుల వివరాలతోపాటు అవస్థాపన సౌకర్యా లను తెలియజేశారు. టీయూలో ఇంజినీరింగ్‌, ఫార్మసీ కాలేజీ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. స్నాతకోత్సవంలో రిజిస్ట్రార్‌ ప్రొ.యాదగిరి, డీన్స్‌ ప్రొఫెసర్‌ గంటా చంద్ర శేఖర్‌, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ప్రవీణ్‌ మామిడాల, ప్రొఫెసర్లు అపర్ణ, రాంబాబు, లావణ్య, శ్రీనివాసులు, హారతి, నాగ రాజు, కనకయ్య, విద్యావర్ధిని, అరుణ, నాగరాజు పాత, పీఆర్వో డైరెక్టర్‌ డా. ఏ.పున్నయ్య, బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
సమిష్టి కృషితో క్షయవ్యాధి నిర్మూలన :గవర్నర్‌
క్షయ వ్యాధి రహిత దేశంగా భారత్‌ను తీర్చి దిద్దాలనే బృహత్తర సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా అమలు చేస్తున్న టిబి ముక్త్‌ భారత్‌ అభియాన్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ చెప్పారు. నిజామాబాద్‌ సమీకృత జిల్లా కార్యాలయాల సముదా యం సమావేశ మందిరంలో టిబి ముక్త్‌ భారత్‌ అభియాన్‌ కార్యక్రమంపై బుధవారం కలెక్టర్‌ టి.వినరు కృష్ణారెడ్డితో కలిసి గవర్నర్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా పర్యటనలో భాగంగా ముందుగా గవర్నర్‌ 7వ బెటాలియన్‌ను సందర్శించి మొక్కనాటారు. వివిధరంగాల్లో ప్రఖ్యా తిగాంచిన కవులు, కళాకారులు, రచయితలు, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందిన క్రీడా కారులు, సామాజిక కార్యకర్తలతో నిజామాబాద్‌ కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఇష్టాగోష్టి జరి పారు. అంతకు ముందు గవర్నర్‌కు ఎమ్మెల్యేలు, అధికారులు, సీపీ, పోలీసులు స్వాగతం పలికారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -