Saturday, July 19, 2025
E-PAPER
Homeతాజా వార్తలుహైద‌రాబాద్ డ్యూరోడైన్‌ ఇండస్ట్రీస్‌లో అగ్నిప్రమాదం..

హైద‌రాబాద్ డ్యూరోడైన్‌ ఇండస్ట్రీస్‌లో అగ్నిప్రమాదం..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : సనత్‌నగర్‌లోని జింకలవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జింకలవాడలో ఉన్న డ్యూరోడైన్‌ ఇండస్ట్రీస్‌లో గురువారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి పరిశ్రమ మొత్తానికి విస్తరించడంలో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో నల్లని పొగ దట్టంగా అలముకున్నది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆరు ఫైర్‌ఇంజన్లు, రోబో సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. అయితే షార్ట్‌సర్క్యూట్‌ వల్లే మంటలు చెలరేగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -