- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తిరుమలలో మరోసారి చిరుత సంచారం చేసింది. అలిపిరి జూ పార్క్ రోడ్డు సమీపంలో చిరుత కనిపించింది. అరవింద్ ఐ ఆస్పత్రి వద్ద… చెక్కర్లు కొట్టింది చిరుత. ఇక ఇది చూసిన భక్తులు… భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అక్కడి నుంచి పరుగులు తీశారు.
ఇక అటు తిరుమల శ్రీవారి సన్నిధిలో సర్వదర్శనాలకు చాలా సమయమే పడుతోంది. గత వారం రోజుల నుంచి తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో… రెండో రోజు టోకెన్లు లేని శ్రీవారి భక్తులకు సర్వదర్శనానికి… 24 గంటల సమయం పడుతుంది. దీంతో శిలా తోరణం వరకు భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నారు.
- Advertisement -