Saturday, July 19, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంషాపింగ్‌ మాల్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 50 మంది మృతి

షాపింగ్‌ మాల్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 50 మంది మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఇరాక్ లోని షాపింగ్‌మాల్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 50 మంది ప్రాణాలు కోల్పోయారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఆల్‌కుట్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం బారినపడి మృతిచెందిన వారిలో పిల్లలు, చిన్నారులే ఎక్కువగా ఉన్నారని పేర్కొన్నాయి. సోషల్‌ మీడియాలో వెలుగులోకి వచ్చిన దృశ్యాల్లో మాల్‌లో చాలాభాగం మంటల్లో చిక్కకుపోయినట్లు కనిపించింది

ఐదంతస్థుల మాల్‌లో చోటుచేసుకున్న ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. 48 గంటల్లో ప్రాథమిక దర్యాప్తు వివరాలు వెల్లడిస్తామని స్థానిక యంత్రాంగం వెల్లడించింది. ఈ ఘటన నేపథ్యంలో ఆ భవనం, షాపింగ్ మాల్ యజమానిపై పలు కేసులు ఫైల్ అయ్యాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -