- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరం మరోసారి అరుదైన రికార్డును కైవసం చేసుకుంది. స్వచ్ఛ భారత్ మిషన్ కింద నిర్వహించే ‘స్వచ్ఛ సర్వేక్షణ్ 2024సలో ఇండోర్ 8వ సారి కూడా దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది. మున్సిపల్ పరిపాలన, కచ్చితమైన మాలిన్య నిర్వహణ, పౌర సహకారం, డిజిటల్ మానిటరింగ్ వంటి అంశాలలో అత్యుత్తమ ప్రదర్శన ఈ నగరాన్ని తిరిగి అగ్రస్థానంలో నిలిపింది.
ఇండొర్ నగర పాలక సంస్థ (IMC) మురుగునీటి శుద్ధి, పొడిగా, తడిగా వ్యర్థాలను వేరుగా సేకరించడం, వ్యర్థాలను పునర్వినియోగం చేయడం, ప్లాస్టిక్ నిషేధం వంటి చర్యలను కఠినంగా అమలు చేసింది. ప్రజలు కూడా చైతన్యంతో ముందుకు వచ్చి ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించారు.
- Advertisement -