నవతెలంగాణ-హైదరాబాద్: ఒడిశాలో విద్యార్థి ఆత్మహత్యను నిరసిస్తూ కాంగ్రెస్ చేపట్టిన బంద్ ఉద్రిక్తతలకు దారితీసింది. ఆ పార్టీ రాష్ట్ర ఇంచార్జీను అజేయ్ లాలును పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ కళాశాల లెక్చరర్ లైంగిక వేధింపులు కారణంగా సదురు విద్యార్థి ఆత్మహత్య చేసుకొంది. దీంతో లెక్చరర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పలురోజులుగా ఒడిశాలోని బాలాసోర్‌లో నిరసనలు మిన్నంటాయి. ప్రతిపక్షంలో ఆధ్వర్యంలో భారీ యోత్తున్న ఆందోళన చేపట్టారు. తాజాగా బాలాసోర్ బంద్ కు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు కాంగ్రెస్ శ్రేణులను కట్టడి చేసి..భారీస్థాయిలో నాయకులను అరెస్ట్ చేశారు. ఈక్రమంలో పోలీసులకు ఆందోళనకారులకు మధ్యన ఘర్షణ వాతావరణంలో నెలకొంది.
లైంగిక వేధింపులకు గురైన విద్యార్థినికి న్యాయం అందించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని..ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ అజేయ్ లాలు విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం దమనకాండకు కాంగ్రెస్ వెనుకడుగు వేయందని, బాధితురాలి కుటుంబానికి న్యాయం లభించేవరకు పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు.
