Saturday, July 19, 2025
E-PAPER
Homeజాతీయంబీహార్‌లో ఎస్‌ఐఆర్‌ పేరుతో ఓట్లను దొంగిలిస్తున్నారు: రాహుల్‌గాంధీ

బీహార్‌లో ఎస్‌ఐఆర్‌ పేరుతో ఓట్లను దొంగిలిస్తున్నారు: రాహుల్‌గాంధీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: బీహార్‌లో ఎన్నికల అధికారులు ఓటర్లను మోసం చేశారని గురువారం కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో.. ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆయన తీవ్రంగా ఆరోపించారు. బీహార్‌లో బీజేపీ ఎలాగైనా గెలవాలని ప్రయత్నిస్తుంది. దీనికితగ్గట్టుగా ఈసీని అడ్డంపెట్టుకుని ఓటర్ల జాబితాను తారుమారు చేస్తుంద‌న్నారు. ప్రభుత్వాధికారులు ఓటర్లకు తెలియకుండానే ఓటరు ఫారాలను నింపి సంతకం చేస్తున్నారని ఓ జర్నలిస్టు పోస్టు చేసిన వీడియోను రాహుల్‌ షేర్‌ చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్‌ ఇప్పటికీ నిష్పాక్షికంగానే వ్యవహరిస్తుందా? లేక ఓట్లను దొంగతనం చేసే శాఖగా మారిపోయిందా అని ఆయన ప్రశ్నించారు.

కాగా, ‘బీహార్‌లో ఎస్‌ఐఆర్‌ పేరుతో ఓట్లను దొంగిలిస్తూ ఎన్నికల కమిషన్‌ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. ఎన్నికల అధికారుల ఉద్యోగం.. దొంగతనం చేయడం. దానికి వారు పెట్టుకున్న పేరు ‘ఎస్‌ఐఆర్‌’. వాళ్లు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని బయటపెట్టినవారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదవుతుంది. ఇసి ఇప్పటికీ ఎన్నికల కమిషన్‌గానే ఉందా? లేదా పూర్తిగా బిజెపి కోసం ఓట్లు దొంగిలించే శాఖగా మారిందా? అని ఆయన ఎక్స్‌ పోస్టులో ప్రశ్నించారు.

ఇటీవల జూలై 10న సుప్రీంకోర్టు ఎస్‌ఆర్‌ఐని కొనసాగించడానికి ఇసికి అనుమతినిచ్చింది. కానీ అదే సమయంలో ఆధార్‌, రేషన్‌కార్డు, ఎలక్టోరల్‌ ఫొటో గుర్తింపు కార్డులను ఓటర్లు గుర్తింపును నిరూపించడానికి ఆమోదయోగ్యమైన పత్రాలుగా అనుమతించడాన్ని పరిగణించాలని వారికి సలహా ఇచ్చింది. న్యాయమూర్తులు సుధాన్షు ధులియా, జారు మాల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -