Friday, May 2, 2025
Homeజిల్లాలుఅంకితభావంతో పని చేస్తేనే గుర్తింపు: డీఎం రఘు 

అంకితభావంతో పని చేస్తేనే గుర్తింపు: డీఎం రఘు 

నవతెలంగాణ- దుబ్బాక 
ఏ వృత్తిలోనైనా విధుల పట్ల అశ్రద్ధ చేయకుండ అంకితభావంతో పనిచేస్తేనే.. ఆ ఉద్యోగికి మంచి గుర్తింపు లభిస్తుందని డిపో ఇన్చార్జ్ మేనేజర్ టీ.రఘు అన్నారు. 35 ఏళ్లుగా కండక్టర్ స్థాయి నుంచి ఏడీసీగా పదోన్నతి పొంది.. ఉద్యోగ విరమణ కాబోతున్న మహమ్మద్ షాదుల్ కు బుధవారం దుబ్బాక లోని బస్సు డిపోలో ఏర్పాటుచేసిన ‘ఉద్యోగ విరమణ’ కార్యక్రమానికి డీఎం రఘు ముఖ్యఅతిథిగా హాజరైనారు. షాదుల్ దంపతులను శాలువాతో ఘనంగా సత్కరించి బహుమతిని అందజేశారు. అనంతరం ఆర్ టీసీ ఉద్యోగులు,కార్మికులు షాదుల్ దంపతులను శాలువాలతో ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో ఎస్ టీఐ కనకలక్ష్మి,డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానికల్ రవీందర్, జేఏసీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, పలువురు ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img