Saturday, July 19, 2025
E-PAPER
Homeతాజా వార్తలులారీ బోల్తా..రైతు క‌ష్టం రోడ్డుపాలు

లారీ బోల్తా..రైతు క‌ష్టం రోడ్డుపాలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: శంషాబాద్‌ నుంచి గుడిమల్కాపూర్‌ కూరగాయల మార్కెట్‌కు టమాటాల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. టమాటాలు మొత్తం రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. లారీ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌ వే డైరీ ఫార్మ్‌ చౌరస్తా వద్ద ఈ ప్రమాదం జరిగింది. అయితే టమాటాల లోడ్‌తో వెళ్తున్న రైతులకు ఎవరికీ ఏ ప్రమాదం జరగకలేదు. కాగా, ఈ ఘటనతో రహదారిపై చాలాసేపటి వరకు ట్రాఫిక్‌ స్తంభించింది. దీంతో ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు క్రేన్‌ సాయంతో లారీని పక్కకు తీశారు. అనంతరం రోడ్డుపై పడిన టమాటాలను తొలగించి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చేశారు.

డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా కొట్టిన లారీ.. రోడ్డుపై పడిపోయిన టమాటాలు

బండ్లగూడ, జూన్ 17: హైదరాబాద్‌ శంషాబాద్‌ సమీపంలో టమాటాల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. శంషాబాద్‌ నుంచి గుడిమల్కాపూర్‌ కూరగాయల మార్కెట్‌కు వెళ్తున్న సమయంలో లారీ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. లారీ బోల్తా కొట్టడంతో అందులో ఉన్న టమాటాలు మొత్తం రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి.

పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌ వే డైరీ ఫార్మ్‌ చౌరస్తా వద్ద ఈ ప్రమాదం జరిగింది. అయితే టమాటాల లోడ్‌తో వెళ్తున్న రైతులు ఎవరికీ ఏ ప్రమాదం జరగకపోవడం విశేషం. కాగా, ఈ ఘటనతో రహదారిపై చాలాసేపటి వరకు ట్రాఫిక్‌ స్తంభించింది. దీంతో ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు క్రేన్‌ సాయంతో లారీని పక్కకు తీశారు. అనంతరం రోడ్డుపై పడిన టమాటాలను తొలగించి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -