Saturday, July 19, 2025
E-PAPER
Homeతాజా వార్తలుజగిత్యాల గురుకులంలో మెడిక‌ల్ క్యాంపు

జగిత్యాల గురుకులంలో మెడిక‌ల్ క్యాంపు

- Advertisement -
  • జిల్లా వైద్యాధికారి డాక్టర్ కే ప్రమోద్ కుమార్

నవతెలంగాణ-జగిత్యాల టౌన్: ల‌క్ష్మీపూర్ గ్రామంలోని మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల విద్యాలయంలో చిన్నారులు అస్వస్థతకు గురైన విష‌యం తెలిసిందే. తాజాగా జిల్లా వైద్యాధికారి విద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ ఆదేశానుసారం విద్యాలయంలో ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. బాధిత‌ విద్యార్థుల‌కు మెరుగైన చికిత్స అందిస్తున్న‌ట్లు తెలిపారు. నిన్న వండిన చికెన్ లో కొంచెం కారం, మసాలా ఎక్కువ అవ్వడం వలన విద్యార్థులకు జీర్ణం కాక కడుపునొప్పి, ప‌లువురు విద్యార్థులు వాంతులు చేసుకున్నార‌ని, వారిని వెంట‌నే జగిత్యాల లోని మాత శిశు సంరక్షణ కేంద్రంలో పీడియాట్రిక్ వార్డుకు రిఫర్ చేశామ‌ని తెలిపారు. పిల్లలకు మెరుగైన చికిత్స అందించ‌డంతో..ప్ర‌స్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని తెలిపారు.

ఈ ఘ‌ట‌న‌లో బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని, ఆర్బిఎస్కే టీంను విద్యాలయంలో ఆరోగ్య శిబిరం నిర్వహించాల్సిందిగా ఆదేశించమ‌న్నారు. అనంతరం ప్రిన్సిపాల్ తో మాట్లాడి వంట‌ల విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశుభ్ర‌త పాటించే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించామ‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె ప్రమోద్ కుమార్, ఉపవైద్యాధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్, కల్లెడ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారిని డాక్టర్ సౌజన్య, డిపిఓ రవీందర్ ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -