Saturday, July 19, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఉక్రెయిన్ కొత్త ప్ర‌ధానిగా యూలియా స్విరిడెన్‌కో

ఉక్రెయిన్ కొత్త ప్ర‌ధానిగా యూలియా స్విరిడెన్‌కో

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ కీలక నిర్ణ‌యం తీసుకున్నారు. ప్రస్తుతం ఆర్థిక మంత్రిగా ఉన్న యూలియా స్విరిడెన్‌కో ను ఉక్రెయిన్ కొత్త ప్రధానమంత్రిగా గురువారం నియమించారు. 2022లో రష్యాతో జరిగిన యుద్ధం తర్వాత ఈ పదవిలోకి వచ్చిన తొలి వ్యక్తిగా ఆమె చరిత్ర సృష్టించారు.

అంత‌కుముందు ప్రధానమంత్రిగా ఉన్న డెనిస్ ష్మైహాల్ తన రాజీనామాను మంగళవారం ప్రకటించారు. ఆయన ఉక్రెయిన్ చరిత్రలోనే అత్యధిక కాలం పాటు పదవిలో ఉన్న ప్రధానమంత్రిగా గుర్తింపు పొందారు. 2020 మార్చి 4న పదవిలోకి వచ్చారు. ఇప్పుడు ఆయన్ను రక్షణ మంత్రిగా నియమించనున్నారు. దీని ద్వారా ఆయన పూర్తిగా పాలన నుండి తప్పుకోకుండా, యుద్ధం నేపథ్యంలో కీలకమైన రక్షణ శాఖ బాధ్యతను చేపడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -